Akkineni Family : అక్కినేని హీరోల పేరులో ‘నాగ’ అని ఎందుకు ఉంటుందో తెలుసా..?

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ కుటుంబాల్లో Akkineni Family ఒకటి. ఈ కుటుంబం నుంచి కూడా అరడజను హీరోలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు సూపర్ హిట్ స్టార్లుగా మారితే.. మరికొందరు తమకు నచ్చిన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. అయితే ఈ ఫ్యామిలీలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే.. ఈ కుటుంబంలోని పెద్ద కుమారుల పేరులో నాగ అని తప్పకుండా ఉంటుంది. అయితే దీని వెనక ఓ బలమైన కారణముందట. మరి అదేంటో తెలుసుకుందామా..?

Akkineni Family
Akkineni Family

అపజయాలను మెట్లుగా చేసుకుని అంచెలంచెలుగా విజయ తీరాలకు చేరి.. శ్రమనే నమ్ముకుని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఓ శక్తి.. అక్కినేని నాగేశ్వరరావు. చివరి క్షణాల వరకు నటనే తన శ్వాసగా బతికారు. తెలుగు ప్రజలంతా ఆయణ్ని ఏఎన్నార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు.. అంతకుమించిన అద్భుతమైన పాత్రల్లో.. దానికి మించిన అద్భుతమైన తన నటనతో.. చరిష్మాతో ప్రేక్షకులను అలరించారు. ప్రేక్షకులు కూడా అంతే ప్రేమగా ఏఎన్నార్ ను ఆదరించారు. 

ఎన్నో వందల సినిమాల్లో నటించిన ఏఎన్నార్ నట సామ్రాట్ గా ఖ్యాతి గడించారు. ఆయన తర్వాత వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టారు అక్కినేని నాగార్జున. తండ్రిబాటలో నడుస్తూ.. అంది వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ తండ్రిని మంచిన తనయుడుగా ఎదిగారు. అమ్మాయిల మనసు దోచే మన్మథుడన్నా.. దుష్టులను చెండాడే శివ అన్నా.. వేంకటేశ్వరుడి ప్రియ భక్తుడు అన్నమయ్య అన్నా.. భక్తుల ఆరాధ్య దైవం సాయిబాబా అన్నా.. తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే పేరు నాగార్జున. ఇలా డిఫరెంట్ పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ ఐదు పదుల వయసులోనూ ఎవర్ గ్రీన్ యంగ్ హీరోలా అలరిస్తున్నారు.

- Advertisement -

నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ టాలీవుడ్ లో అడుగుపెట్టారు. నాగచైతన్య మొదటి నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుంటూ తన కెరీర్ ను పక్కా ప్రణాళికా ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నాడు. మొదట్లో నాగచైతన్యకు, అఖిల్ కుఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత చైతూ క్రేజ్ దక్కించుకున్నా.. అఖిల్​ మాత్రం ఇప్పుడిప్పుడే రాణిస్తున్నాడు.

అక్కినేని ఫ్యామిలీ హీరోల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదిలేది వారి పేరులో కామన్ గా ఉన్న నాగ అనే పదం. దీనిపై గ‌తంలోనే నాగార్జున ఓసారి క్లారిటీ ఇచ్చనట్లు కథనాలు ఉన్నాయి. త‌మ ఫ్యామిలీలో అంద‌రి పేర్ల‌కు ముందు నాగ అని ఎందుకు వ‌స్తుందో వివరించారాయన. అదేంటంటే..?

నాగేశ్వ‌ర రావు క‌డుపులో ఉన్న‌ప్పుడు ఆయ‌న త‌ల్లికి క‌ల‌లో పాములు క‌నిపించేవ‌ట‌. దీంతో ఆమె త‌న కొడుకికి నాగేశ్వ‌ర రావు అని పేరు పెట్టారట. అంతేకాదు.. త‌మ కుటుంబంలో పుట్టే వారసులకు నాగ అని పేరు వ‌చ్చేలా పెట్టాల‌ని అనుకున్నారట. దీంతో నాగేశ్వ‌ర రావు.. త‌న కుమారుడు నాగార్జున‌కు అని పేరు పెట్టగా.. తర్వాత నాగార్జున కూడా అదే ఫాలో అయ్యారట. అయితే అఖిల్ విష‌యంలో మాత్రం అలా చేయ‌లేదు. ఎందుకంటే మొద‌టి సంతానానికి మాత్ర‌మే అలా పెట్టాల‌ని అనుకున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ కథనాలు మాత్రం గతంలో ఇలా వచ్చాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here