Tollywood Heroines : చీరకట్టులో ముద్దుగుమ్మ.. చూపుల బాణాలు గుచ్చెనమ్మా



Tollywood Heroines చీరలోని గొప్పదనం తెలుసుకో.. చీరకట్టి ఆడతనం పెంచుకో అని ఓ పాటలో ఉన్నట్లు అమ్మాయిలు చీర కడితే ఆ అందమే వేరు. ముఖ్యంగా హీరోయిన్లు చీరకట్టులో కనిపిస్తే ఇక కుర్రాళ్ల గుండె ఝళ్లుమనడం ఖాయం.

Tollywood Heroines
Tollywood Heroines

సోషల్ మీడియాలో తరచూ తమకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటారు హీరోయిన్లు. అయితే తాజాగా కొంతమంది కథానాయికలు చీరకట్టులోని ఫొటోలు పోస్టు చేశారు. అవి చూసిన కుర్రాళ్లు ఎంత ముద్దొస్తున్నారో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Praneetha

బొంగరాళ్లాంటి కళ్లు తిప్పింది.. ఉంగరాలున్న జుట్టు తిప్పింది.. అవును మనం మాట్లాడుతోంది కన్నడ భామ ప్రణీత గురించే. ఈ బ్యూటీ పెళ్లి చేసుకుని ఓ పాపకు జన్మనిచ్చినా ఈమె అందం ఇంకా తగ్గలేదు. తల్లయ్యాక ప్రణీత మరింత అందంగా తయారైంది. తాజాగా గ్రీన్ కలర్ శారీలో ట్రెడిషనల్ ఫొటోలు షేర్ చేసింది.

Sreeleela

ధమాకా సినిమాతో ఇటీవలే వంద కోట్ల క్లబ్ లో చేరింది శ్రీలీల. ఈ బ్యూటీ తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ హీరోయిన్ అయిపోయింది. తాజాగా ఈ బ్యూటీ శారీలో దిగిన ఫొటోలు షేర్ చేసింది.

Malavika Mohanan

మలయాళి భామ మాళవిక మోహనన్ తరచూ వెస్టర్న్ డ్రెస్సుల్లో దర్శనమిస్తుంది. ఈ భామ కాస్త స్కిన్ షో ఎక్కువగానే చేస్తుంది. కానీ తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు చూసి ఫ్యాన్ ఫిదా అవుతున్నారు. పట్టు చీరలో ఈ భామ ఎంతో అందంగా కనిపిస్తోంది.

Rakul Preet Singh

రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా పోస్టు చేసిన ఫొటోల్లో రెడ్ కలర్ శారీలో మెరిసిపోతోంది. ఛత్రివాలీ అనే సినిమా ప్రమోషన్స్ లో ఈ భామ బిజీగా ఉంది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు చీరలో రకుల్ సొగసు చూడతరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.