ఈమధ్య కాలం లో అక్కినేని ఫ్యామిలీకి అటు సినిమాల పరంగా ఇటు వ్యక్తిగతంగా ఏది కలిసిరావడం లేదు. వీళ్ళ రీసెంట్ మూవీస్ ‘ఘోస్ట్’ మరియు ‘థాంక్యూ’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.అటు వ్యక్తిగతంగా కూడా నాగ చైతన్య సమంత తో విడాకులు తీసుకొని తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు నాగ చైతన్య.
అంతే కాకుండా ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు రావడం ఆయన పై తీవ్రమైన విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి, విడాకులు తీసుకున్న ఏడాదికే మరో అమ్మాయి తో డేటింగ్ చేస్తున్నావా అంటూ సమంత ఫ్యాన్స్ నాగ చైతన్య పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.అంతే కాకుండా ఆయన రెండవ పెళ్లి గురించి కూడా సోషల్ మీడియా లో వచ్చే వార్తలపై అభిమానుల్లో కాస్త అసహనం మొదలైంది.
ఇది ఇలా ఉండగా అక్కినేని నాగ చైతన్య రెండవ పెళ్ళికి అమల ఒక షాకింగ్ కండిషన్ పెట్టిందట. అఖిల్ పెళ్లి కుదిరేంత వరకు పెళ్లి చేసుకోరాదని, మీ ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నామని, కాబట్టి ముందుగా నీ పెళ్లి చేసే సమస్యే లేదని, ఇద్దరి పెళ్లి ఒకేసారి జరిపించే పనైతేనే ఒప్పుకుంటానని కండిషన్ పెట్టిందట. అలా అఖిల్ కి పెళ్లి కుదిరేంత వరకు నాగ చైతన్య రెండవ పెళ్లి పట్టాలెక్కే సమస్యే లేదట.
అఖిల్ కి గతం లో శ్రియా భూపాల్ అనే అమ్మాయి తో నిశ్చితార్థం అయ్యింది. నాగ చైతన్య – సమంత నిశ్చితార్థం జరిగినప్పుడే వీళ్లది కూడా వెంటనే జరిగిపోయింది, కానీ మధ్యలో ఏమి జరిగిందో ఏమో తెలీదు కానీ అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది, ఇక ఆ తర్వాత అఖిల్ పెళ్లి ఊసే లేదు, అయితే గత కొంతకాలం నుండి అఖిల్ కి సంబంధాలు చూస్తున్నారట, త్వరలోనే అక్కినేని ఫ్యాన్స్ కి ఒక శుభవార్త కూడా రాబోతుందని టాక్.
అంతే కాకుండా నాగ చైతన్య రెండవ పెళ్లి ఎవరితో ఉండబోతుంది అనే దానిపై కూడా దాదాపుగా సస్పెన్స్ వీడినట్టే. శోభిత దూళిపాళ్ల తో నాగ చైతన్య డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది, వీళ్లిద్దరు కలిసి ఈమధ్యనే ఫారిన్ టూర్ కి కూడా వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.