‘ఏజెంట్’ క్లోసింగ్ కలెక్షన్స్..డిజాస్టర్స్ లో సరికొత్త రికార్డ్

- Advertisement -

అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏజెంట్’ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే.అక్కినేని అభిమానులు ఈ చిత్రం పై మొదటి నుండి భారీ ఆశలు పెట్టుకొని ఉన్నారు.ఈ చిత్రం తో అఖిల్ నేరుగా స్టార్ లీగ్ లోకి అడుగుపెడుతాడని ఆశపడ్డారు.కాని వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి.చాలా నిర్లక్ష్యంగా ఈ సినిమాని ఆయన తీసినట్టుగా అనిపించింది.

ఏజెంట్
ఏజెంట్

కాని అఖిల్ మాత్రం ఈ చిత్రానికి ఎంతో కష్టపడ్డాడు, ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కలేకపోవడం తో ఆయన ఎంత మానసిక దిగ్బ్రాంతి కి గురి అయ్యి ఉంటాడో ఊహించుకోవచ్చు.అక్కినేని ఫ్యామిలీ కి పీడకలగా నిల్చిన ఏజెంట్ చిత్రం ఈరోజు రెండు కొత్త సినిమాలు విడుదల అవ్వడం తో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి థియేటర్స్ అన్నిట్లో ఏజెంట్ చిత్రాన్ని తీసేసారు.

అక్కినేని అఖిల్
అక్కినేని అఖిల్

దీనితో ఈ సినిమా వసూళ్లు కేవలం వారం రోజులకే క్లోజ్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక భారీ బడ్జెట్ చిత్రానికి ఇలా జరగడం దురదృష్టకరం.ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమా క్లోసింగ్ లో ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి కేవలం 6 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.అందులో నైజాం ప్రాంతం లో కేవలం కోటి 67 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.

- Advertisement -

అలాగే సీడెడ్ లో 83 లక్షలు, ఉత్తరాంధ్ర లో 81 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 46 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 39 లక్షలు, గుంటూరు జిల్లాలో 66 లక్షలు, కృష్ణ జిల్లాలో 35 లక్షలు, అలాగే నెల్లూరు జిల్లాలో 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.వాస్తవానికి క్లోసింగ్ లో వచ్చిన ఈ వసూళ్లు మొత్తాన్ని ‘ఏజెంట్‘ కేవలం నైజాం మొదటి రోజు వసూలు చేస్తుందని అప్పట్లో ట్రేడ్ అంచనా వేసేది.అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్లోసింగ్ కలెక్షన్స్ అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here