దూసుకొచ్చిన ‘రామ బాణం’ లక్ష్యాన్ని చేరుకుందా..గోపీచంద్ ఈసారైనా హిట్ కొట్టాడా..!

- Advertisement -

నటీనటులు : గోపీచంద్ , జగపతి బాబు, డింపుల్ హయాతి, కుష్బూ , నాజర్, వెన్నెల కిషోర్, సచిన్ ఖేద్కర్

దర్శకత్వం : శ్రీవాస్
మ్యూజిక్ : మిక్కీ జె మేయర్
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ

- Advertisement -

మాస్ సినిమాలతో ఆడియన్స్ లో ఊర మాస్ హీరో గా గోపీచంద్ కి మంచి ఇమేజి ఉంది. విలన్ గా కెరీర్ లో పీక్ స్టేజికి వెళ్లిన ఆయన, ఆ తర్వాత హీరో గా సక్సెస్ లు అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. పైగా ఆయనకీ ఉన్నది ఊర మాస్ హీరో ఇమేజి, ఈ ఇమేజి కోసం ఎంతోమంది హీరోలు పరితపిస్తుంటారు. అయితే గత కొంతకాలం నుండి గోపీచంద్ కి సరైన సక్సెస్ లేదు. చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆయన చివరి చిత్రం ‘పక్కా కమర్షియల్’ కూడా బాక్స్ ఆఫీస్ పరంగా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.ఇప్పుడు గోపీచంద్ గతం లో ఆయనకీ లక్ష్యం మరియు లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన శ్రీవాస్ తో కలిసి ‘రామబాణం’ అనే చిత్రం తీసాడు.ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది.

రామ బాణం
రామ బాణం

కథ :

అన్నదమ్ముల మధ్య మన టాలీవుడ్ లో ఎన్నో కథలు వచ్చాయి,సూపర్ హిట్స్ గా నిలిచాయి, ఈ చిత్రం కథ కూడా అలాంటి సెంటిమెంట్ ఉన్న కథనే.కెమికల్ ఫార్మింగ్ మీద పోరాటం చేసే జగపతి బాబు పై మరియు ఆయన కుటుంబం పై విలన్స్ ఎన్నో కుట్రలు మరియు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు.వారి నుండి హీరో గోపీచంద్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు.జగపతి బాబు కోరుకున్న విధంగా కెమికల్ ఫార్మింగ్ ని అరికట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చేలా చేశాడా లేదా అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

గోపీచంద్
గోపీచంద్

విశ్లేషణ :

ఇలాంటి రొటీన్ ఫ్యామిలీ డ్రామాలను జనాలు చూసి చూసి విసిగిపోయారు, ఒకవేళ రొటీన్ గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంటర్టైన్ అయ్యేట్టు రెండు గంటల పాటు థియేటర్స్ సీట్లలో కూర్చోపెట్టగలిగితే సక్సెస్ అయ్యినట్టే.కానీ ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ శ్రీవాస్ కొన్ని కామెడీ సన్నివేశాలతో బాగానే తీసాడు కానీ, సెకండ్ హాఫ్ దగ్గరకి వచ్చేసరికి ఆడియన్స్ కి ఒక రొటీన్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ ని రప్పించాడు. గోపీచంద్ మార్క్ యాక్షన్ సన్నివేశాలు మరియు కుటుంబ నేపథ్యం ఉంటే చాలు అని అనుకున్నాడో ఏమో, అది ఒకప్పటి ఫార్ములా, ఇప్పుడు ఒక సినిమాకి ప్రేక్షకుడు థియేటర్ కి కథలాలంటే కచ్చితంగా థియేటర్ చూడాలి అనిపించేలా ఉండాలి. ‘రామ బాణం’ సినిమా ట్రైలర్ చూసినప్పుడే ఇది రొటీన్ సినిమా అని జనాలకు అర్థం అయ్యిపోయింది.దీనితో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా వీక్ గా ఉన్నాయి.రీసెంట్ సమయం లో ఎన్నో ఉదాహరణలు చూసిన తర్వాత కూడా ఎందుకు మేకర్స్ ఇలాంటి సినిమాలు తీస్తారో అర్థం కాదు అంటున్నారు విశ్లేషకులు.

ఇక గోపీచంద్ తన ట్రేడ్ మార్క్ సినిమాల్లో ఉండే ఫైట్స్, డైలాగ్స్ మరియు ఎలివేషన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు.అలాంటి సినిమాలు ఆయనకీ కొట్టినపిండి లాంటిది కాబట్టి ఈ సినిమాని కూడా కాసేపు టైం పాస్ అయ్యేలా చేసాడు. ఇక ఈ చిత్రం లో యూట్యూబర్ గా నటించిన డింపుల్ హాయతి పర్వాలేదు అనే రేంజ్ లో చేసింది.జగపతి బాబు చాలా కాలం తర్వాత ఒక పూర్తి స్థాయి పాజిటివ్ రోల్ లో చాలా చక్కగా నటించాడు.ఆయన సన్నివేశాలు ఈ చిత్రం లో చాలావరకు క్లిక్ అయ్యాయి.అయితే ఈ చిత్రం లోని పాటలు ఒక్కటి కూడా ఆకట్టుకునేలా లేదు, అసలే రొటీన్ సినిమా అంటే దానికి తోడు పాటలు సినిమాకి అడ్డంగా మారింది.చూసే ఆడియన్స్ కి చిరాకు కలిగించేలా చేసింది, మిక్కీ జె మేయర్ నుండి ఇలాంటి మ్యూజిక్ మాత్రం ఆశించలేదు.ఇక ఈ సినిమాకి ప్లస్ గా మారిన అంశాలలో ఒకటి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్.నిర్మాతలు ఎక్కడా కూడా తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

చివరి మాట :

గోపీచంద్ మార్క్ ఫైట్స్, డైలాగ్స్ మరియు ఎలివేషన్ సన్నివేశాలను చూడాలనుకునేవాళ్ళు ఏ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. రొటీన్ కమర్షియల్ మూవీ అని ముందుగానే ఫిక్స్ అయ్యి థియేటర్ కి వెళ్తే కొంతమేరకు సంతృప్తి చెందగలరు.

రేటింగ్ : 2.25/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here