ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ లో అతి పెద్ద మైనస్ కనిపెట్టిన నెటిజన్లు.. చూసుకోవాలి కదా భయ్యా

- Advertisement -

చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ట్రైలర్ నిన్న విడుదల అయ్యింది. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు. మిగిలిన భాషల్లో డబ్ చేశారు. ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి చాలా నెలలు అయ్యింది. టీజర్ విడుదల చేసిన తర్వాత అందులో ఉన్న విఎఫ్ఎక్స్ కి చాలా కామెంట్స్ వచ్చాయి. దాంతో సినిమా బృందం సినిమా విడుదల తేదీ వాయిదా వేసి, మళ్లీ సినిమాపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని చాలా మార్పులు చేశారు.

ఆదిపురుష్
ఆదిపురుష్

అంతే కాకుండా చాలా సందర్భాల్లో సినిమాకి సంబంధించి వచ్చిన పోస్టర్స్ విషయంలో కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ కి కూడా మంచి స్పందన వస్తోంది. సినిమాలో చాలా మార్పులు చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. కాకపోతే కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.అవేంటో ఇప్పుడు చూద్దాం. సినిమా విఎఫ్ఎక్స్ విషయంలో మార్పులు చేశారు. అది అర్థం అవుతోంది. కాకపోతే ఎన్ని మార్చినా కూడా రామాయణం అంటే ఇప్పటి వరకు ప్రేక్షకులకి ఇలాగే ఉంటుంది అనే ఒక భావన ఉంది. ట్రైలర్ చూస్తున్నంత సేపు ఎక్కడ మనం మన రామాయణాన్ని చూస్తున్నాము అనే ఒక విషయం అసలు అనిపించలేదు అని అన్నారు.

adhipurush Trailer Review

ఈ ట్రైలర్ లో ఉన్న అతిపెద్ద మైనస్ పాయింట్ ఏమిటంటే ప్రభాస్ డైలాగ్ డెలివరీ. నిద్రమత్తులో డైలాగ్స్ చెప్పినట్టుగా అనిపించింది. దీనిని థియేటర్స్ లో వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. మొదటి ట్రైలర్ లో కూడా ప్రభాస్ చాలా డల్ డైలాగ్ డెలివరీ తో కానిచ్చేశాడు. సినిమాలో డబ్బింగ్ బాగుంటుందని అందరూ అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా విడుదల చేసిన ట్రైలర్ లో మాత్రం అలా అనిపించలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here