‘ఆదిపురుష్’ యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది..లెక్క 1000 కోట్ల నుండి మొదలు!

- Advertisement -

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు తిరుపతి లో అంగరంగ వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిన్న జియ్యర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. తిరుపతి నగరం మొత్తం నేడు శ్రీ రామ జపం తో మారుమోగిపోయింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు.

ఆదిపురుష్ ట్రైలర్
ఆదిపురుష్ ట్రైలర్

ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ మొత్తం రాముడు మరియు రావణుడి మధ్య పోరాట సన్నివేశాలతో నింపేశారు. ముఖ్యంగా ఆ సన్నివేశాలు మొత్తం హై టెక్నాలజీ గ్రాఫిక్స్ తో చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ తో రామాయణం ఇది వరకు వెండితెర పై ఎవ్వరూ కూడా ఆవిష్కరించలేదు.

ఇక ఈ ట్రైలర్ లో రావణాసురుడు సీతని అపహరించుకొని వెళ్లడం, హనుమంతుడు సీత వద్దకు వెళ్లి నాతో వచ్చేయి తల్లి తీసుకెళ్తాను అని అనడం. ఆ తర్వాత ప్రభాస్ రావణుడిని ఉద్దేశించి డైలాగ్స్ చెప్పడం వంటివి హైలైట్ గా నిలిచాయి. డైలాగ్స్ చాలా బాగున్నాయి కానీ, ప్రభాస్ దానిని చెప్పే విధానం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు అనిపించింది. చాలా నీరసంగా ఉన్న ఆయన డైలాగ్ డెలివరీ ఈ ట్రైలర్ లో పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా అదిరిపోయాడు.

- Advertisement -
kriti sanon

సీతగా కృతి సనన్ ఆమె తప్ప మరెవ్వరూ చెయ్యలేరు అనే విధంగా అనిపించింది. టీవీ మరియు మొబైల్ లో చూసినప్పుడే గ్రాఫిక్స్ అద్భుతంగా అనిపించాయి, ఇక థియేటర్స్ లో ఎంత అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందో ఊహించుకోవచ్చు. ఆదిపురుష్ ట్రైలర్ ని చూసిన తర్వాత ఇంకా 16 వ తారీఖు వరకు వేచి చూడాలా? అని అనుకుంటున్నారు ఫ్యాన్స్, కానీ అప్పటి వరకు ఆగాల్సిందే, తప్పదు మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here