ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం త్రిషనా.. విజయ్తో పోలుస్తూ ప్రభాస్ ను రిజక్ట్ చేసిందా..

- Advertisement -

టాలీవుడ్ లో ఆరడుగుల అందగాడు మోస్ట్ ఎలిజిబుల్ స్టార్ ప్రభాస్. 45 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పటికి సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి ఏదో ఒక ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. మీడియాలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ప్రభాస్, అనుష్క పెళ్ళంటూ హడావుడి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే ప్రభాస్ కి అనుష్క, శృతి సనన్, త్రిష వంటి హీరోయిన్లతో ప్రేమాయణం ఉందని అయితే వీరు కొన్ని కారణాలవల్ల విడిపోయారు అంటూ వార్తలు వినిపించాయి.ప్రభాస్, అనుష్క ప్రేమ గురించి అందరికీ తెలిసిందే.

ప్రభాస్

అయితే ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చెన్నై బ్యూటీ త్రిష తో ప్రేమలో పడ్డారట. ఆ కారణంతోనే వీరిద్దరి కాంబినేషన్లో వర్షం,పౌర్ణమి, బుజ్జి గాడు వంటి మూడు సినిమాలు వచ్చాయి. ఇక వరుస సినిమాల్లో నటించే టైంలో వీరి మధ్య ప్రేమ మరింత బలపడిందట.అయితే అప్పటికే త్రిష కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్. ఇక కోలీవుడ్ లో నటిస్తున్న టైం లో విజయ్ కి త్రిష కి మధ్య ప్రేమ ఉందని వార్తలు వినిపించాయి.

త్రిష

ఇక ప్రభాస్ కూడా త్రిష ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడని, అందుకే ఆమెకు వరుసగా మూడు సినిమాలలో ఛాన్సులు ఇచ్చాడని, అదే సమయంలో ఇటు విజయ్ తో ప్రేమలో ఉందన్న విషయం తెలిసి, త్రిష క్యారెక్టర్ నచ్చక త్రిష కి బ్రేకప్ చెప్పాడట. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు త్రిష ప్రభాస్ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు.అయితే ఒక సినిమాలో ప్రభాస్, త్రిషని హీరో హీరోయిన్స్ గా తీసుకుందామని దర్శక నిర్మాతలు అనుకున్నారట. కానీ ప్రభాస్ మాత్రం త్రిష ను వద్దని చెప్పడంతో వాళ్లు మరో హీరోయిన్ తో సినిమా తీశారు. ఇక వీరి మధ్య బ్రేకప్ జరిగి ఇన్ని రోజులైనా కూడా మళ్లీ వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు అంటే ప్రభాస్ కి త్రిష మీద ఎంత కోపం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here