Vishal : రోజుకు 25 సిగరెట్లు తాగే.. విశాల్ ఒక్క సారిగా ఎలా మానేశాడో తెలుసా?

- Advertisement -


Vishal : ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, వ్యాపారవేత్త జి. కె రెడ్డి కుమారుడు నటుడు విశాల్. నేడు ఆయన తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు, నిర్మాతగా పాపులర్ అయ్యాడు. విశాల్ 2004లో తమిళంలో విడుదలైన చెల్లామే( తెలుగులో ప్రేమ చదరంగం) సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ మరుసటి ఏడాది విడుదలైన చందకోజి(తెలుగులో పందెం కోడి) సినిమా ఆయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది.

Vishal
Vishal

2013లో విశాల్ నటించిన పాండ్యనాడు( తెలుగులో పల్నాడు) సినిమాతో నిర్మాతగా మారారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది చిత్రాలను నిర్మించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటుడు విశాల్ మాట్లాడుతూ.. తాను కాలేజీ రోజుల్లోనూ, నటించడం మొదలుపెట్టిన సమయంలోనూ చైన్ స్మోకర్‌గా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. రోజుకు కనీసం 25 సిగరెట్లు తాగానని కూడా చెప్పాడు.

అయితే ఒకరోజు ఆ అలవాటు మానేయాలి అనుకుని, ఆఖరి సిగరెట్‌ను ఫ్లష్ చేసి.. నా స్నేహితుడికి నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి ఆ అలవాటును మానేశాడు. వ్యక్తికి ఉన్న చెడు అలవాట్ల కంటే దృఢ సంకల్పమే ముఖ్యమని, క్రమంగా తగ్గించుకోవాల్సిన అవసరం లేదని విశాల్ పేర్కొన్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here