Chiranjeevi తో సినిమా చెయ్యాలని ఎవరికీ మాతం ఉండదు..?, 70 ఏళ్ళ వైఫేయస్సుకి దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తూ, బాక్స్ ఆఫీస్ వద్ద నేటి తరం స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డ్స్ పెడుతున్నాడు. మధ్యలో పదేళ్లు సినిమాలకు దూరమైనా కూడా ప్రేక్షకుల్లో ఆయన ఇమేజి చెక్కు చెదరలేదని రీ ఎంట్రీ తర్వాత తెలిసింది.
ఇప్పుడే ఆయన రేంజ్ ఇలా ఉంటే , ఇక ఆయన పీక్ టైం లో ఏ రేంజ్ లో ఉండేదో ఊహించుకోవచ్చు. అప్పట్లో చిరంజీవి సినిమా అంటే ఒక పండగ. ఆయన ఫ్లాప్ సినిమాలకు వచ్చే వసూళ్లు, తన తోటి స్టార్ హీరోలకు సూపర్ హిట్ అయితే వస్తాయి. ఇలాంటి స్థాయి ఊరికినే ఆయనకీ రాలేదు, ఎన్నో కష్టాలు, ఒడిదుడుగులు ఎదుర్కొని, వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకుంటూ రాబట్టే ఈ స్థాయి వచ్చింది.
చిరంజీవి తో సినిమా అంటే నిర్మాతకి అప్పట్లో టేబుల్ ప్రాఫిట్స్. పెట్టిన ప్రతీ పైసాకి పదింతలు లాభం విడుదలకు ముందే వచ్చేవి. అందుకే ఆయన కాల్ షీట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టేవారు. అలా అప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూడా చిరంజీవి డేట్స్ కోసం తెగ కష్టపడింది. ఆమె నిర్మాణ సంస్థలో చిరంజీవి ని హీరో గా పెట్టి ఒక సినిమా తియ్యాలని అనుకుంది. ఆ సినిమా పేరు ‘వజ్రాల దొంగ’. చిరంజీవి తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన కోదండ రామి రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ సినిమా ఓపెనింగ్ కి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ముఖ్య అతిధిగా విచ్చేసి మొదటి షాట్ కి క్లాప్ కొట్టాడు. అలా శ్రీదేవి నిర్మాతగా వ్యవహరిస్తూ, హీరోయిన్ గా మొదలైన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. రెండు పాటలు షూటింగ్ కూడా చేసారు. సినిమా తీస్తున్న సమయం లో కోదండ రామిరెడ్డి కి ఎందుకో ఈ చిత్రం మీరిద్దరి కాంబినేషన్ కి తగ్గ స్టోరీ కాదు అని అనిపిస్తుంది అనడం తో శ్రీదేవి ఈ చిత్రాన్ని ఆపేసింది అట. రెండు పాటలు, అలాగే పలు సన్నివేశాల చిత్రీకరణకు అప్పట్లో కోటి 50 లక్షలు ఖర్చు అయ్యిందట. అలా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మొదలెట్టి ఆపేసింది శ్రీదేవి .