కొంతమంది చూస్తే ఆత్మాభిమానానికి ప్రతీక లాగ అనిపిస్తుంటారు. కన్నబిడ్డలు ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా వాళ్ళ మీద ఏమాత్రం ఆధారపడుకుండా, ఇప్పటికే తమ సొంత కష్టార్జితం మీద బ్రతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. వయస్సు మీదపడి, శక్తి లేకపోయినా కూడా ఒకరి మీద ఆధారపడాలి అని అనుకోకపోవడం ఎంత మంచి మనసు చెప్పండి..?, అలాంటి వాళ్ళు నేటి కాలం లో అరుదుగా ఉంటారు. వారిలో ఒకరే అరుణ్ కుమార్.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా జీవనం సాగిస్తూ తన పిల్లల్ని పెంచి పోషించాడు. వారికి చదువు నేర్పించడమే కాకుండా, కోరినట్టు బ్రతికే స్వేచ్చని ఇచ్చాడు. మంచి మర్యాదలు ఇచ్చాడు, కష్టపడే తత్వాన్ని ఆస్తిగా ఇచ్చాడు. తండ్రిని ఆదర్శంగా తీసుకొని సినిమాల మీద మక్కువతో నాటక రంగం లో రాణించి, ఆ తర్వాత టీవీ యాంకర్ గా మారి, సీరియల్స్ లో అవకాశాలు సంపాదించి, తద్వారా సినిమాల్లో కూడా అవకాశాలు పొంది నేడు పాన్ వరల్డ్ స్టార్ గా వేలకోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే రేంజ్ కి ఎదిగి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఆయన కొడుకు యాష్.
యాష్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలా మారుమోగిపోతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. కేజీఎఫ్ సినిమాకి ముందు ఆయన కేవలం ఒక కన్నడ స్టార్ హీరో మాత్రమే. కానీ ఎప్పుడైతే కేజీఎఫ్ సినిమా వచ్చిందో, అప్పటి నుండి ఆయన పాన్ వరల్డ్ స్టార్ గా అవతరించాడు. అయితే ఏ కొడుకుకి అయినా ఎదిగిన తర్వాత తన తండ్రిని బాగా చూసుకోవాలని కోరిక ఉంటుంది. యాష్ కి కూడా అలాంటి కొరికే ఉంది.
కానీ ఆయన తండ్రి అర్జున్ కుమార్ మాత్రం ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రం లో కోటా శ్రీనివాసరావు మాదిరి అన్నమాట. తన సొంత కష్టం మీద బ్రతకాలని కోరుకునే మనిషి. యాష్ ఎన్నో సార్లు ఆ ఉద్యోగం మానెయ్ నాన్న అని బ్రతిమిలాడినా కూడా అరుణ్ కుమార్ మాటలు వినడం లేదు. ఆయన ఇప్పటికీ కూడా ఆర్టీసీ డ్రైవర్ గానే కొనసాగుతున్నాడు. ఇలాంటి ఆదర్శవంతులైన మనుషుల నుండి మనం ఎన్నో నేర్చుకోవాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.