దర్శకుడు.. ఆన్ ది స్క్రీన్ హీరో శాసిస్తే, బిహైండ్ ది స్క్రీన్ డైరెక్టర్ శాసిస్తాడు. చలనచిత్రానికి సంబంధించి 24 శాఖలను సమన్వయపరిచి సమర్ధవంతంగా ఆయా శాఖల నుంచి తనకు కావల్సిన విధంగా.. వారి వారి సామర్ధ్యాన్ని ఉపయోగించుకుని తన ఆలోచనలకు ప్రాణం పోసి తెరపైకి ఒక దృశ్యంగా మలచే వ్యక్తే దర్శకుడు. ఓ సినిమా హిట్ అవ్వాలన్నా, ఫ్లాప్ అవ్వాలన్నా అంతా ఆయన చేతిలోనే ఉంటుంది. ఒక సినిమా రూపొందాలంటే 24 విభాగాలు పనిచేయాలి. అసలు ఇంతకీ 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటి… ఇందులో ఏ శాఖలు ఉంటాయో తెలుసుకుందాం
స్టంట్-దర్శకులు, స్టంట్-ఆర్టిస్టులు.. గూస్ బంప్స్ వచ్చే పోరాట సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన సాహసాలు ఈ స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. వీరు తమ జీవితాలను సైతం పణంగా పెట్టి రిస్క్ సన్నివేశాలు చేస్డాడు. ఈ కళకు శౌర్యం, దూకుడు తప్పనిసరి.
ఆర్ట్ డైరెక్షన్.. ఆర్ట్ డైరెక్టర్ సినిమాకి సంబంధించి ప్రాపర్టీస్ చూసుకుంటారు. దర్శకుడు రిక్వైర్మెంట్ కు తగినట్లుగా బ్యాగ్రౌండ్లో ఉండాల్సిన అన్ని విషయాలను ఫైనలైజ్ చేసేది ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారే.
సినిమాటోగ్రాఫర్.. దర్శకుడు కల కంటే… ఆ కలను తన కెమెరా కళ్లతో మొట్ట మొదట చూసే వ్యక్తి సినిమాటోగ్రాఫర్. ఓ డైరెక్టర్ తెరపై ఏదీ చూపించాలనుకున్నా అది సినిమాటోగ్రాఫర్ మాత్రమే చూపిస్తాడు.
ఎడిటర్.. దర్శకుడు ఓ సినిమా ద్వారా చాలా చెప్పాలనుకుంటాడు. కానీ, నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులకు కథ రుచించకపోవచ్చు. అందుకే వారికి ఎప్పుడు? ఎంత? ఎలా చెప్పాలో, చూపించాలో ఎడిటరే నిర్ణయిస్తాడు. సినిమా జయాపజయాల విషయంలో కీలక బాధ్యత తీసుకుంటాడు.
డబ్బింగ్ ఆర్టిస్ట్.. సినిమాల్లో నటీనటుల నటనను మనం ఎంతగా ఎంజాయ్ చేస్తామో.. వాళ్ళ వాయిసెస్కు కూడా మనం అలాగే మెస్మరైజ్ అవుతాం. వాళ్ళ నటన మనల్ని ఎంతలా ప్రభావితం చేసి.. వాళ్ళను గుర్తుంచుకునేలా చేస్తుందో వాళ్ళ గాత్రం కూడా మనపై అలాంటి ప్రభావమే చూపిస్తాయి. ఓ నటుడికి తన గాత్రాన్ని అరువు ఇచ్చే వ్యక్తినే డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటారు.
సినిమా డ్రైవర్లు.. సినిమా షూటింగ్ మొదలు ఫైనల్ అవుట్ ఫుట్ విడుదలయ్యే వరకు దర్శకుడు సహా సినిమా యూనిట్ మొత్తం అనేక ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంటుంది. వారిని గమ్యస్థానాలకు చేర్చే డ్రైవర్లను సినిమా డ్రైవర్లు అంటారు. వీరు కూడా 24 క్రాఫ్ట్‌లలో ఒకరు.
ప్రొడక్షన్ ఉమెన్.. ఇక ఈ డిపార్ట్మెంట్లో మొత్తం స్త్రీలు మాత్రమే ఉంటారు. వీరు ప్రొడక్షన్ అసిస్టెంట్ల సూచనల మేరకు సినిమా సెట్ మొత్తాన్ని శుభ్రంగా ఉంచడం సహా సినిమాకు సంబంధించి ఇతరత్ర చిన్న చిన్న పనులు చేస్తుంటారు.
స్టోరీ రైటింగ్.. సినిమా నిర్మాత దగ్గర ఒక అందమైన హీరో, హీరోయిన్ అలాగే మంచి దర్శకుడు ఉన్నాసరే సినిమా మొత్తానికి కథే ప్రాణం. ఈ సినిమా కథ రాసే వారిని కథా రచయిత అంరు.
మ్యూజిక్ డైరెక్టర్.. సినిమా ఎంత బాగా వచ్చినా దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేది సంగీతమే. ఓ సన్నివేశాం ప్రేక్షకుల మదిలో నిలిచిపోవాలన, వాళ్ల మనసులను తాకాలన్నా వీరి పాత్ర చాలా కీలకం.
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్.. ఈ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లు షూట్ మొదలైన నుంచి పూర్తయ్యే వరకు అన్ని తామే చూసుకుంటారు. ప్రొడ్యూసర్ ఆదేశాల మేరకు వీరు పని చేస్తూ ఉంటారు. ఈరోజు షూటింగ్ కు ఎంతమంది వస్తున్నారు? ఎవరెవరికి కార్లు పంపించాలి? అలాగే వారికి భోజన వసతి, ఎలా వాళ్లని చివరికి షూటింగ్ అయిన తర్వాత డ్రాప్ చేసే వరకు అన్ని బాధ్యతలు వారే దగ్గరుండి చూసుకుంటారు.
లైటింగ్.. ఈ లైటింగ్ విభాగానికి ప్రత్యేకత ఉంది. ఒక రాత్రిని పగలులా మార్చాలి అన్న, పగలు రాత్రిగా మార్చాలన్న తమ లైటింగ్ టెక్నిక్స్ తో వీరు మ్యాజిక్ చేస్తూ ఉంటారు. అవసరానికి అనుగుణంగా వీరు లైటింగ్ ఫిక్స్ చేస్తూ ఉంటారు.
స్టూడియో వర్కర్స్.. వివిధ వర్గాలకు చెందిన కార్పెంటర్లు, పెయింటర్లు సెట్ తయారీదారులు అందరూ కూడా ఈ స్టూడియో వర్గాల విభాగానికి వస్తారు. ఆర్ట్ డిపార్ట్మెంట్కు కావాల్సిన విధంగా వారు కోరిన విధంగా ప్రాపర్టీలు సిద్ధం చేయటమే వారి కర్తవ్యం.
ప్రొడక్షన్ అసిస్టెంట్లు.. వీరిని సెట్ అసిస్టెంట్లను కూడా పిలుస్తూ ఉంటారు. వీళ్ళు సెట్ లో ఉన్న అందరికీ ఆహార పదార్థాలు అందజేస్తూ ఉంటారు. ఆహార అవసరాలకు అనుగుణంగా వీరు ఆహారాన్ని అందజేస్తూ సినిమా షూటింగ్ ఎక్కడా ఇబ్బంది లేకుండా జరిగేందుకు తమ వంతు పాత్ర పోషిస్తారు.
మేకప్ మ్యాన్.. ఇక మేకప్ మ్యాన్ విషయానికి వస్తే సినిమా షూటింగ్లో ముఖ్యపాత్ర పోషిస్తారు. ఓ వ్యక్తిని అందంగా తయారు చేయాలన్నా, అందంగా ఉన్న వ్యక్తిని డీగ్లామర్‌గా మార్చాలన్నా అంతా వీరి చేతిలోనే ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే నటులను పాత్రకు తగ్గట్టుగా తయారు చేయడమే వారి పని.
కాస్ట్యూమ్ డిజైనర్లు.. సన్నివేశం బట్టి ఓ హీరో, హీరోయిన్, విలన్ సహా క్యారెక్టర్లు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, దాన్ని ఎలా డిజైన్ చేయాలనేది వీరే నిర్ణయిస్తారు. దర్శకుడి అవసరానికి తగినట్లుగా వీరు నటీనటులకు దుస్తులను సిద్ధం చేస్తూ ఉంటారు.
సినీ ఆర్టిస్టులు… ఇక వీరందరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నటీనట్లుందరి గురించి మనకు బాగా తెలిసిందే.
ఆడియో.. డబ్బింగ్, రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ లాంటివన్నీ కూడా ఆడియోగ్రాఫర్లు చూసుకుంటూ ఉంటారు. లవ్ స్టోరీ, హారర్, థ్రిల్లర్, యాక్షన్.. జోనర్ ఏదైనా సరే సరే సన్నివేశాన్ని బట్టి సౌండ్ ఎఫెక్ట్స్‌ను సెట్ చేస్తుంటారు.
పబ్లిసిటీ ఆర్టిస్టులు.. వీరు వివిధ రకాల మీడియాలు, అందుబాటులో ఉన్న ప్లాట్ఫామ్లో ద్వారా సినిమాని పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు కేవలం పోస్టర్ల ద్వారానే పబ్లిసిటీ జరిగేది. కానీ ఇప్పుడు పాటలు ట్రైలర్లు, టీజర్లు, ఈవెంట్స్.. ఇలా రకరకాల విధాలుగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్.. సినిమాకి కావలసిన జూనియర్ ఆర్టిస్టులను వీరే సరఫరా చేస్తుంటారు.
ఔట్ డోర్ టెక్నీషియన్లు.. ఔట్‌డోర్ షూటింగ్స్‌లో పనిచేసే టెక్నీషియన్స్‌ను ఔట్ డోర్ టెక్నీషియన్స్ ఉంటారు. కెమెరా డిపార్ట్మెంట్, లైటింగ్ డిపార్ట్మెంట్ సహా మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు వీరు సహకారం అందిస్తారు.
స్టిల్ ఫోటోగ్రాఫర్లు.. వీరు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆసక్తికరమైన స్టిల్స్‌ను క్యాప్చర్ చేస్తూ ఉంటారు. వాటినే పోస్టర్ల ద్వారా పబ్లిసిటీ చేస్తూ ఉంటారు.
కొరియోగ్రాఫర్లు.. వీరు సినిమాలో డాన్స్ చేసే హీరో హీరోయిన్లతో పాటు ఇతర నటీనటులకు డాన్స్ స్టెప్స్ కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు.
జూనియర్ ఆర్టిస్టులు.. సన్నివేశాన్ని బట్టి ఓ ఫ్రేమ్ నిండుగా కనపడాలంటే అందులో జూనియర్ ఆర్టిస్టులు తప్పని సరిగా ఉండాలి. వారికి డైలాగ్స్ ఏమి ఉండవు. అలా వచ్చి ఇలా మాయవుతుంటారు. ఉదాహరణకు ఓ మార్కెట్, ట్రాఫిక్, ఫైట్ ఇలా ఏదైనా సన్నివేశం కానీ.. అందులో పాత్రలకు చూట్టూ ఉండే జనాలను జూనియర్ ఆర్టిస్టులు అంటారు.