Balakrishna : బాలకృష్ణ నన్ను రూమ్ కు రమ్మన్నాడు.. క్యాస్టింగ్ కౌచ్ ను బయట పెట్టిన తమిళ నటి

- Advertisement -

Balakrishna : టాలీవుడ్ స్టార్ న‌టుడు నందమూరి బాలకృష్ణ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయనపై తాజాగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. కోలీవుడ్‌కు చెందిన సీనియర్ హీరోయిన్ విచిత్ర బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు అటు త‌మిళ సినీ పరిశ్రమతో పాటు ఇటు తెలుగు పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. 2001లో బాల‌కృష్ణ న‌టించిన చిత్రం ‘భలేవాడివి బాసూ’. ఈ సినిమాలో శిల్పాషెట్టి, అంజల ఝవేరీ హీరోయిన్‌లుగా న‌టించ‌గా న‌టి విచిత్ర గిరిజన యువతి పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తాను కాస్టింగ్ కౌచ్ వేధింపులను ఎదుర్కొన్నానని విచిత్ర తెలిపింది.

Balakrishna
Balakrishna

ఇంతకీ ఏం జ‌రిగింది అంటే.. సీనియర్ నటి విచిత్ర ప్రస్తుతం త‌మిళ‌ బిగ్ బాస్ సీజన్7లో కంటెస్టెంట్‌గా ఉంది. అయితే నవంబర్ 21న జరిగిన ఓ ఎపిసోడ్‌లో నటి విచిత్రను తన జీవితాన్ని మలుపుతిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని బిగ్ బాస్ అడిగారు. దీనికి సమాధానంగా విచిత్ర మాట్లాడుతూ.. ‘‘2001 సంవత్సరంలో నేను ఒక తెలుగు సినిమాలో నటించాను. కానీ అదే నా చివరి సినిమా అయ్యింది. ఈ సినిమా షూటింగ్ మళంపుజ అడవుల్లో జ‌రిగింది. సినిమా షూటింగ్ స‌మ‌యంలో నన్ను ఒక స్టార్ హోటల్‌లో ఉంచారు. మేనేజ్‌మెంట్ తమకు రాత్రిపూట పార్టీ ఏర్పాటు చేసింది. ఆరోజు రాత్రి నేను క్యాస్టింగ్ కౌచ్ సంఘ‌ట‌న‌ను ఎదుర్కొన్నాను.

పార్టీ ముగిసిన అనంత‌రం సినిమా హీరో నా దగ్గ‌ర‌కు వ‌చ్చి డైరెక్ట్‌గా తన గదికి రమ్మని అడిగాడు. దాంతో నేను ఒక్కసారిగా షాకయ్యాను. నాకేమి అర్థంకాలేదు. తరువాతి నా గదికి వెళ్లి పడుకున్నాను. మరుసటి రోజు షూటింగ్‌లొ పాల్గొన్నప్పటి నుంచి అనేక వేధింపులు, సమస్యలను ఎదుర్కొన్నాను. ఇక ఆ త‌రువాత సినిమాలంటే ఆసక్తి తగ్గిపోయిందని, పెళ్లి తరువాత పూర్తిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకొన్నా’’ అని విచిత్ర తెలిపారు. అయితే ఈ వీడియోలో బాల‌య్య పేరును విచిత్ర‌ ఎక్కడ వెల్ల‌డించ‌లేదు కానీ త‌న చివ‌రి చిత్రం ‘భలేవాడివి బాసూ’ ఇందులో హీరో బాలయ్య. ఆ సినిమా 2001లో వచ్చింది.. దీంతో నటి విచిత్ర చెప్పింది బాలయ్య గురించే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here