Gossips : సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ ఎదురుకునే కష్టాలు హీరోలు ఎదురుకోరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంతో గొప్ప టాలెంట్ ఉన్న స్త్రీలు క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందేమో అనే భయం తో ఇండస్ట్రీ లోకి రావడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు అమ్మాయిలు గురించి మాట్లాడుకోవాలి. దర్శక నిర్మాతలు అడిగిన ప్రతీ దానికి తలలు ఊపే రకం కాదు కాబట్టి మన తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీ లో మెలగడం కష్టం.
కానీ నార్త్ ఇండియన్స్ కి కేక్ వాక్ అనే చెప్పాలి. వాళ్ళు దర్శక నిర్మాతలు ఏమి అడిగిన చెయ్యడానికి సిద్ధపడుతారు. అలా ఒక ప్రముఖ కుర్ర హీరోయిన్ అప్పట్లో బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కి కమిట్మెంట్ ఇవ్వడం వల్ల వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించే ఛాన్స్ దక్కింది. ఎక్కువగా ఆ స్టార్ హీరో సినిమాలోనే ఈమె నటించింది. అలా చూస్తూ ఉండగానే ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ఈమె డేట్స్ హీరోలకు చిక్కడం చాలా కష్టం అయిపోయేది అప్పట్లో. అలా ఈమెకి అవకాశాలు ఇప్పించిన ఆ స్టార్ హీరోకి కూడా డేట్స్ ఇవ్వలేకపోయింది. దాంతో చిర్రెత్తిపోయిన ఆ హీరో , నువ్వు ఎంజాయ్ చేస్తున్న ఈ కెరీర్ నేను పెట్టిన బిక్ష, అలాంటిది నువ్వు నా సినిమాకే డేట్స్ లేవని చెప్తావా, ఎంత ధైర్యం నీకు అని ఆమెతో గొడవలకు దిగాడట. మిగతా వాళ్లకి కమిట్మెంట్స్ ఇచ్చి అడ్వాన్స్ తీసుకున్నాను, మరి ముందు వాళ్ళకే సినిమా చెయ్యాలి కదా, ఇవన్నీ నీకు తెలియనివి కాదు అని అనిందట.
అప్పుడు ఆ హీరో, రీసెంట్ గా ఒప్పుకున్న సినిమాకి డేట్స్ క్యాన్సిల్ చేసి నాకు డేట్స్ ఇవ్వు అని అడిగాడట. ఆ హీరోయిన్ కుదరదు అని సమాధానం ఇచ్చిందట, దీంతో చిర్రెత్తిపోయిన ఆ హీరో సదరు హీరోయిన్ పై యాసిడ్ దాడి చేసాడట. సమయానికి ఆమె అప్రమత్తంగా ఉండడంతో పక్కకి జరిగి ఆ యాసిడ్ దాడి నుండి తప్పించుకుంది. బెదిరిపోయిన ఆ హీరోయిన్ ఆ హీరో సినిమాకి డేట్స్ ఇచ్చిందట. ఇది మీడియా లో అప్పట్లో సెన్సేషనల్ గా మారింది. మేము చెప్పిన ఆ హీరోకి ఇప్పటి వరకు పెళ్లి కూడా కాలేదు, అతను ఎవరో మీరే ఊహించి కామెంట్స్ చెయ్యండి.