Suriya : సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పిలవబడే జంటలలో ఒకటి సూర్య – జ్యోతిక జంట. వీళ్లిద్దరు కలిసి గతం లో ఎన్నో సినిమాలు చేసారు. అలా సినిమాల ద్వారా ఏర్పడిన పరిచయం వీళ్లిద్దరి మధ్య ప్రేమగా మారి పెళ్లి చేసుకునేలా చేసింది. ఇన్నేళ్లు ఎంతో అన్యోయంగా గడిపిన ఈ జంట ఇటీవలే విడిపోయింది అంటూ సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి.

అయితే అలాంటిది ఏమి లేదంటూ జ్యోతిక రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా సూర్య జ్యోతిక ఇన్నేళ్లు అత్తమామ్మలు మరియు కార్తీ కుటుంబం తో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ వాళ్ళని, కానీ ఇప్పుడు మనస్పర్థలు వచ్చి సూర్య తన కుటుంబం ని తీసుకొని ముంబై కి షిఫ్ట్ అయిపోయాడు అంటూ వార్తలు వినిపించాయి. దీనికి గురించి కూడా జ్యోతిక క్లారిటీ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ తాను తన పిల్లలిద్దరి చదువుకోసమే ముంబై కి షిఫ్ట్ అయ్యానని, అంతే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ లో చాలా ప్రాజెక్ట్స్ కి సంతకం చేసానని, షూటింగ్స్ కూడా ఇక్కడే ఉండడం తో మేము ముంబై షిఫ్ట్ అయ్యామని, అన్నీ పూర్తి అవ్వగానే మళ్ళీ చెన్నై కి తిరిగి వెళ్లిపోతామని జ్యోతిక ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అంతే కాదు కూతురు దియా చదువుల్లో, ఆటల్లో నెంబర్ 1. రీసెంట్ ఆమె తన స్కూల్ లో క్రీడా పోటీలలో కెప్టెన్ గా రాణించి టీం ని గెలిపించింది అట.

దీనిని జ్యోతిక తన ఇసంతాగ్రామ్ అకౌంట్ లో గర్వంగా చెప్పుకుంటూ దియా ఫోటోని షేర్ చేసింది. దియా ని చూసిన ప్రతీ ఒక్కరు అమ్మాయి ఇంత చక్కగా ఉంది సినిమాల్లో హీరోయిన్ గా వస్తే బాగుండును అని కామెంట్స్ చేసారు. కాని దియాకి సినిమాల మీద ఆసక్తి లేదని తెలుస్తుంది.