Sonakshi Sinha : బాలీవుడ్ దబంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తన తెరంగేట్రమే బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్‌తో చేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి. ఓవైపు సల్మాన్ వంటి సీనియర్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు యంగ్ హీరోలతో జత కడుతోంది.
తాజాగా ఈ బ్యూటీ డబుల్ ఎక్స్‌ఎల్ అనే మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీలో లావుగా ఉన్న అమ్మాయిలు ఇంట్లో, సమాజంలో ఎదుర్కొనే సమస్యల గురించి చాలా హృద్యంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో సోనాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
సోనాక్షి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. ఈ బ్యూటీ తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు దగ్గరలో ఉంటుంది.
తాజాగా సోనాక్షి తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ న్యూ ఇయర్‌ని ఫిన్‌లాండ్‌లో ఫొటోషూట్‌తో ప్రారంభించింది. మంచు కొండల్లో సేద తీరుతూ భలే ఎంజాయ్ చేసింది.
అందాలలో అహో మహోదయం అంటూ సోనాక్షీ తెల్లగుర్రంతో పోజ్ ఇచ్చింది. మంచులో ఆటలాడుతూ న్యూ ఇయర్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది.