Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోల అందరి సరసన నటించింది. దాదాపు 20ఏళ్ల పాటు ఇండస్ట్రీని ఏలింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే నాగ చైతన్యను పెళ్ల చేసుకుంది. తర్వాత మనస్పర్థల కారణంగా డివోర్స్ తీసుకుని విడిపోయింది. ప్రస్తుతం సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తుంది.

కొన్నాళ్ల క్రితం మయోసైటిస్ వ్యాధికి గురి అయి చికిత్స చేయించుకుంది. ప్రస్తుతం వ్యాధి నుంచి బయటపడి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉంది. మయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. సగంలో ఆపేసిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో పడింది. ఓ మంచి కథతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ .. హెల్త్‌కు సంబంధించిన వీడియోలతో పాటు బోల్డ్ ఫోటోలతో రెచ్చిపోతుంది.
గతంతో పోల్చుకుంటే సమంత గ్లామర్ డోస్ పెంచేసింది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్‌లు చేస్తూ కుర్రాళ్లకు కిక్కిస్తుంది. అసలు మనం చూసేది సమంతనేనా అన్నట్లుగా తెగించి అందాలను ఆరబోస్తుంది. సమంత ఇంతలా గ్లామర్ డోస్ పెంచడానికి కారణం శోభిత అని బాలీవుడ్ మీడియా కోడైకూస్తుంది. నాగచైతన్య శోభిత అందాలు చూసే తనను దూరం పెట్టాడని భావించింది సమంత.. ఆమెను మించి అందాలలో రెచ్చిపోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకే రోజు రోజుకు డ్రెస్ సైజులు తగ్గించి బోల్డ్ గ్లామర్‌తో కుర్రాళ్లుకు పిచ్చెక్కిస్తుంది.