ఈ ఫొటోలో చిచ్చర పిడుగులాగా కనిపిస్తున్న ఈ బుడతడు ఎవరో గుర్తు పట్టారా..? ఇతను బాలనటుడిగా పలు సినిమాల్లో నటించాడు, ఈయనగారి తల్లి పెద్ద నటి మరియు దర్శకురాలు కూడా.తల్లి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు, తనదైన శైలిలో హీరోగా రాణించి మంచి బ్రాండ్ ఇమేజిని క్రియేట్ చేసుకున్నాడు. హీరో గా సక్సెస్ సాధించిన తర్వాత , క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా సౌత్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న వారిలో ఒకడిగా నిలిచిపోయాడు.

ఆయన లేని సినిమా అంటూ ఈమధ్య ఏది లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన మరెవరో కాదు, సీనియర్ హీరో నరేష్.రీసెంట్ గానే ఈయన మరో పెళ్లి చేసుకోండి వార్తల్లో నిల్చిన సంగతి తెలిసిందే.తరచూ ఆయన సోషల్ మీడియా లో ఎదో ఒక విషయం లో ట్రెండ్ అవుతూనే ఉన్నాడు.ఒకప్పుడు కామెడీ హీరో గా నరేష్ కి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ఉంది.

విజయ నిర్మల గారి తనయుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటికీ ఈయన యాక్షన్ హీరో అవ్వాలనుకోలేదు.కామెడీ జానర్ ని ఎంచుకొని అందులోనే ఆయన గొప్పగా రాణించాడు.ఇక హీరో గా కెరీర్ ముగిసిన తర్వాత వరుసగా క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ వేసాడు.ఇండస్ట్రీ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా మారాడు. నటుడిగా ఆయన అంటే అందరికీ ఎంతో గౌరవం ఉంది, కానీ రీసెంట్ గా ఆయన చేసిన కొన్ని పనుల కారణంగా ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నాడు.

నాల్గవ పెళ్లి చేసుకోవడం తో పాటుగా, మూడవ భార్య విడాకులు ఇవ్వట్లేదని, ఆమె క్యారక్టర్ మీద ఈయన చేసిన వ్యాఖ్యలు అతనిపై ఉన్న మర్యాదని కోల్పోయేలా చేసింది.ఫలితంగా నేడు ఆయన సోషల్ మీడియా లోనే పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారిపోయాడు.ఇప్పుడు రీసెంట్ గా తన నాల్గవ భార్య పవిత్ర లోకేష్ తో కలిసి ‘మళ్ళీ పెళ్లి‘ అనే సినిమా తీసాడు. వాళ్ళ మధ్య జరిగిన లవ్ స్టోరీ ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట.ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.