Vijay Deverakonda : అర్జున్ రెడ్డి సినిమా పేరు వినగానే చాలామందికి మూడ్ రావడం సహజమే.. యంగ్ హీరో విజయ్ దేవరకొండను స్టార్ ను చేసింది.. ఈ సినిమా ఒక ప్రభంజనాన్ని సృష్టించింది.. ఓవర్ నైట్ స్టార్ ను చేసింది..ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ..ఇక ఇతని సినిమాల్లో నటించిన చాలా మంది హీరోయిన్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారో ఒక లుక్ వేద్దాం పదండీ..
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరైన ఈయన.. పెళ్లిచూపులు సినిమాతో మరింత ఫేమ్ దక్కించుకున్నాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాలో తన రొమాంటిక్ యాంగిల్ చూపించి యువతను తన వశం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండకు అమ్మాయిలు మాత్రమే కాదు స్టార్ సినీ సెలబ్రిటీలు కూడా ఆయనకు అభిమానులుగా మారిపోయారు. బాలీవుడ్ భామలు అయితే ఒక్కరోజైనా విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తే చాలు అనే స్థాయికి వచ్చారు అంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు..
ఈయన సినిమాలలో మొదటి నుంచి నటించిన హీరోయిన్లు చాలా మంది సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. విజయ్ వాడకం అలాంటిది అంటూ అప్పటిలో కొన్ని పూకార్లు కూడా గుప్పుమాన్నాయి. శాలిని పాండే, రాశిఖన్నాలు అయితే సోషల్ మీడియాకే పరిమితం అయ్యారు.. ఒక్క రష్మిక మందన్నా మాత్రమే కాస్త స్పీడు మీదుంది.
తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ చిత్రాల్లో వరుస అవకాశాలను అందుకుంటుంది.. స్టార్ హీరోయిన్ లిస్టులో ఉంది.. ఈమధ్యే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యింది.. అదన్నమాట.. విజయ్ దేవరకొండ సినిమాల్లో నటించిన హీరోయిన్లు కొందరు ఒకటిరెండు సినిమాలకే దుకాన్ సర్దేశారు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఏడాది సంపాదన రూ.55 కోట్ల వరకు ఉంటుందట…