యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ విజయంతో ఫుల్ జోష్ మీదున్న JR NTR తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇటీవలే జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. అక్కడ కూడా ఆ మూవీపై ప్రేక్షకుల రియాక్షన్ చూసి ఫుల్ ఖుష్ అయ్యాడు. ఇక జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది.
కొరటాల శివ అనగానే మనకు గుర్తొచ్చేది సోషల్ కాజ్. సామాజిక అంశాల్ని స్పృశిస్తూ శివ సినిమాలు ఉంటాయి. ఇప్పటికే జనతా గ్యారేజ్ తో హిట్ అందుకున్న ఈ కాంబో మరో బ్లాక్ బస్టర్ కు రెడీ అవుతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ న్యూలుక్ లో కనిపించనున్నాడు. అందుకోసమే కాస్త మేకోవర్ ట్రయల్స్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ వద్ద తన మేకోవర్ చేయించుకున్నాడు.
న్యూ హెయిర్ కట్ లో ఎన్టీఆర్ సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఆలీమ్ పోస్టు చేసిన ఈ మేకోవర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాస్త గడ్డాన్ని ట్రిమ్ చేసుకుని, స్ట్రెయిట్ హెయిర్‌స్టెల్లో ఎన్టీఆర్ ట్రెండీగా కనిపిస్తున్నాడు. కర్లీ హెయిర్ కంటే ఎన్టీఆర్ కు ఈ న్యూ లుక్ బాగా సూట్ అయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
💥💥
Man of Masses #JrNTR slaying it in style in this new makeover!!🔥🔥@JrNTR #NTR30 #NTR #TeluguFilmNagar pic.twitter.com/5AiidZ6nda— Telugu FilmNagar (@telugufilmnagar) November 11, 2022