మెగాస్టార్ Chiranjeevi హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. వరుస పరాజయాల తర్వాత వచ్చే హిట్ కేవలం హీరో కి మాత్రమే కాదు, అభిమానులకు కూడా మర్చిపోలేని జ్ఞాపకం అనే చెప్పాలి..చిరంజీవికి ఈ సినిమా అలాంటిదే..రీ ఎంట్రీ తర్వాత వరుసగా రెండు వంద కోట్ల రూపాయిల షేర్ ని కలెక్ట్ చేసిన సినిమాల తర్వాత ఆచార్య మరియు గాడ్ ఫాదర్ వంటి కమర్షియల్ ఫెయిల్యూర్స్ చిరంజీవి మార్కెట్ ని కాస్త డౌన్ చేసాయి.
ఆ తర్వాత వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఇప్పుడు నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయ్యే దిశగా ముందుకు అడుగులు వేస్తుంది..ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుకలను నిన్న రాత్రి వరంగల్ లో లక్ష మంది అభిమానుల సమూహం లో ఘనంగా జరిపారు..ఈ ఈవెంట్ మూవీ యూనిట్ తో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ముఖ్య అతిధి గా హాజరయ్యాడు.
అయితే ఈ విజయోత్సవ సభలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వివాదాస్పదం గా మారాయి..ముఖ్యం గా రవితేజ ని ఉద్దేశించి చిరంజీవి పొరపాటున చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో ట్రోలింగ్ కి దారి తీస్తుంది.. ఇంతకు ఆయన ఏమి మాట్లాడాడు అంటే ‘ ఈ చిత్రం లో నేను బురద పడిన రవితేజ ఫోటోని నా లుంగీ తో తుడిచి ముద్దు ఇస్తాను.. ఈ సన్నివేశం చేసినప్పుడు బాబీ అనేవాడు..
అన్నయ్య ఏ పెద్ద హీరో ఒక చిన్న హీరో కి అలాంటి సన్నివేశం చెయ్యడానికి ఇష్టపడరు.. కానీ మీరు ఎలా చేసేశారని.. నేను అలా ఎలివేట్ చేస్తేనే రాబొయ్యే చనిపొయ్యే సన్నివేశం పండుతుంది.. కాబట్టి నేను అది చెయ్యాలి అంటూ చేశాను.. ఈరోజు ఆ సన్నివేశానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది’ అంటూ చిరంజీవి వ్యాఖ్యానించాడు.. అయితే ఇక్కడ చిరంజీవి రవితేజ ని చిన్న హీరో అనడం వివాదాస్పదం గా మారింది.. రవితేజ ని వయస్సులో చిన్నవాడు అన్నాడని మెగా ఫ్యాన్స్ దీనికి కౌంటర్ ఇస్తున్నాడు.. మరి చిరంజీవి దీనికి వివరణ ఇస్తాడో లేదో చూడాలి.