kalki 2898 ad : రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ కల్కి చిత్రం నిన్న అర్థ రాత్రి నుండి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ యాప్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. థియేటర్స్ లో ఎన్నో అద్భుతమైన మైలురాళ్లను దాటుకుంటూ, 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించిన ఈ చిత్రం, ఓటీటీ లో కూడా అదే రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఓటీటీ లోకి విడుదలకు ముందు థియేటర్స్ లో చూడని అదనపు సన్నివేశాలను జోడించి, విడుదల చేస్తామని మేకర్స్ పబ్లిసిటీ చేసారు. కానీ అది జరగలేదు. ఉన్న సినిమానే 6 నిమిషాలు కట్ చేసి విడుదల చేసారు. సినిమా రన్ టైం 181 నిమిషాలు, అంటే 3 గంటల 1 నిమిషం.
ఇది థియేటర్ లో మనం చూసిన కల్కి సినిమా రన్ టైం. కానీ ఓటీటీ లో కేవలం 175 నిమిషాలు మాత్రమే వదిలాడు. అంటే రెండు గంటల 55 నిమిషాలు అన్నమాట. అదనపు సన్నివేశాలను జత చేస్తామని పబ్లిసిటీ చేసి, చివరికి ఉన్న సినిమాని కట్ చేసి వదులుతారా అంటూ అభిమానుల చేత చివాట్లు తింటున్నారు మైత్రీ మూవీ మేకర్స్. కల్కి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం ఓటీటీ లో విడుదల అవుతున్నప్పుడు పెద్దగా పబ్లిసిటీ అవసరం లేదు. ఎందుకంటే ఆడియన్స్ ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటారు. థియేటర్స్ లో చూసిన వారు కూడా మళ్ళీ సినిమాని చూస్తారు, అందుకోసం అదనపు సన్నివేశాలు జత చేస్తున్నాము అంటూ పబ్లిసిటీ ఇవ్వడం అవసరమా. జనాలు అంత వెర్రోళ్ళు లాగా అనిపిస్తున్నారా అని కల్కి టీం సోషల్ మీడియా లో నెటిజెన్స్ చేత తీవ్రమైన విమర్శలు ఎదురుకుంటుంది.
ఇకపోతే ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘రాజా సాబ్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని కూడా ఇటీవలే విడుదల చేసారు. అలాగే రీసెంట్ గానే హను రాఘవపూడి తో ప్రభాస్ చిత్రం మొదలైంది. ఈ సినిమాని ప్రకటించిన రోజు నుండే అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇవి కాకుండా త్వరలోనే ‘సలార్ 2’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’ చిత్రాలను కూడా ప్రారంభించబోతున్నాడు ప్రభాస్.