Allu Arjun మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోలలో బన్నీ కూడా ఒకడు.. బన్నీ ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను చూపిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో అయ్యాడు.. పుష్ప సినిమాతో ఇటీవల పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ప్రస్తుతం ఈయన సినిమాల కోసం పాన్ ఇండియా వైడ్ జనాలు వెయిట్ చేస్తున్నారు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. గంగోత్రి సినిమా తో హీరో గా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు..
అయితే ఆ సినిమా మంచి ను అందుకోవడంతో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు ఐకాన్ స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు టాప్ హీరో గా హవాను కొనసాగిస్తున్నాడు.. అందుకే బన్నీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. బన్నీ సినిమాల విషయానికొస్తే.. క్లాస్ మాస్ , రొమాన్స్ తో ఉండటంతో పాటుగా స్టైలిష్ స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తున్నారు.. బన్నీ రొమాన్స్ చేసిన సినిమాలు గురించి తెలుసుకోవాలని మెగా అభిమానులు అనుకుంటున్నారు.. ఎంతైనా బన్నీ డ్యాన్స్ , స్టయిల్ కు సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఇకపోతే బన్నీ సరసన జోడీగా నటించి రొమాన్స్ చేసిన హీరోయిన్లలో ఆ ఇద్దరు స్పెషల్ ఎందుకని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.. ఆ ఇద్దరు ఎవరు, ఎందుకో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..
కాజల్ అగర్వాల్..
అల్లు అర్జున్,కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో ఆర్య 2 వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో రొమాన్స్ కొంచం ఎక్కువైంది.. అందుకే కాజల్ నటనకు పడిపోయాయని చాలా సార్లు బన్నీ కూడా అన్నాడు… ఆ తర్వాత వీరి కాంబోలో కొత్త సినిమా రాలేదు.. కానీ ఫ్యాన్స్ వీరిద్దరినీ ఒకే స్క్రీన్ పై చూడాలని కోరుకుంటున్నారు..
తమన్నా…
బద్రీనాథ్ సినిమాలో తమన్నా, బన్నీ కలిసి నటించారు.. ఆ సినిమా కథ పరంగా పర్వాలేదని అనిపించిన కూడా వీరిద్దరి రొమాన్స్ మాత్రం బాగా హిట్ అయింది.. తమన్నా మంచి యాక్టర్.. తనతో మరో సినిమా ఛాన్స్ కోసం బన్నీ ఎదురు చూస్తున్నారు.. వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం పక్కా..
ఆ హీరోయిన్లు ప్రస్తుతం అంతగా సినిమాలు చెయ్యలేదు.. కానీ బన్నీ మాత్రం ఓ రేంజులో సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఆ తర్వాత గురుజితో మరో సినిమా చేయనున్నాడు..