Bharateeyudu 2 First Review : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఆల్ టైం క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ తీస్తే అందులో శంకర్ , కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు(ఇండియన్) చిత్రం కచ్చితంగా ఉంటుంది. శంకర్ అద్భుతమైన విజన్, కమల్ హాసన్ నటన ఈ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది. ఆరోజుల్లోనే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే, ఏ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఈ సినిమా టీవీ లో టెలికాస్ట్ అయితే మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుంటాయి. ఆ స్థాయి క్లాసిక్ ని మ్యాచ్ చెయ్యడం మళ్ళీ శంకర్ కి కూడా కష్టమే అని చెప్పొచ్చు. కానీ ఆయన ఆ చిత్రానికి సీక్వెల్ గా అదే కమల్ హాసన్ తో భారతీయుడు 2 చిత్రం చేసాడు.
అనేక ఒడిదుడుగుల మధ్య నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం, కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రీ స్టార్ట్ చేసి శంకర్ పూర్తి చేసారు. జులై 14 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని ఇటీవలే ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది ప్రముఖులకు ప్రీమియర్ షో వేశారు. ఈ సినిమాకి వారి నుండి అద్భుతమైన ఫీడ్ బ్యాక్ ఉంది. దేశం లో జరుగుతున్న అన్యాయాలను ఎదురుకోవాలి అని తపన ఉండే కుర్రాడికి, సేనాపతి ఎలా సహాయపడ్డాడు అనేదే స్టోరీ. ముందుగా ఊహించినట్టుగానే సోషల్ మెసేజితో పాటుగా, కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిస్ కాకుండా చూసుకున్నాడట డైరెక్టర్ శంకర్.
ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయుడు 2 చిత్రం ఫక్తు కమర్షియల్ సినిమా. భారతీయుడి తరహాలో క్లాసిక్ అనే మైండ్ సెట్ తో పోకుండా, ఒక కమర్షియల్ సినిమాని చూడబోతున్నాం అనే అంచనాలతో ఆడియన్స్ ఈ చిత్రానికి వెళ్తే కచ్చితంగా సంతృప్తి చెందుతారని టాక్ వినిపిస్తుంది. అనిరుద్ అందించిన నేపధ్య సంగీతం అనేక సన్నివేశాలకు ప్రాణం పోసిందట. వింటేజ్ శంకర్ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందించిన ఈ చిత్రం ఆడియన్స్ అంచనాలను కూడా ఇదే విధంగా అందుకుంటుందా లేదా అనేది చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన తమిళం అడ్వాన్స్ బుకింగ్స్ కాసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. తెలుగు బుకింగ్స్ కూడా మరికాసేపట్లో ప్రారంభం కానుంది.