Anchor Sreemukhi బుల్లి తెర రాములమ్మ శ్రీముఖి పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. శ్రీముఖికి మంచి క్రేజ్ ఉంది. ఈవెంట్లు, ఎంటర్టైన్మెంట్ షోలు అంటూ బిజీగా ఉన్న శ్రీముఖి బిగ్ బాస్ మూడో సీజన్‌తో కాస్త వెనుకపడింది. బిగ్ బాస్ షోతో శ్రీముఖి మీద నెగెటివ్ పెరిగిపోయింది.. ఆ తర్వాత కొద్ది రోజులు ఖాళీగానే ఉంది.. ప్రస్తుతం వరుస షోలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది.. స్మాల్ స్క్రీన్ పై సక్సెస్ అయిన విధంగా వెండి తెర పై సక్సెస్ అవ్వలేదు.. అయితే శ్రీముఖి పెళ్లి గురించి గతంలో ఎన్నో వార్తలు వినిపించాయి.. తాజాగా మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి..
ఈ అమ్మడు బుల్లితెర పై చేసే సందడి అంతా ఇంత కాదు.. సీరియల్ ఆర్టిస్టులతో శ్రీముఖి ఆడించే ఆటలు, ఆమె చేసే షోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అవినాష్‌తో శ్రీముఖి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కామెడీ బాగానే వర్కౌట్ అవుతుంటుంది.. ఇదిలా ఉండగా.. తాజాగా శ్రీముఖి అభిమానులతో ముచ్చట్లు పెట్టింది.. ఈ సందర్బంగా నిన్ను బాగా ఇరిటేట్ చేసే, ప్రేమించే ఫ్రెండ్స్ గురించి నెటిజన్స్ అడిగారు.. ఆర్జే చైతూ, అవినాష్ పేర్లను శ్రీముఖి చెప్పింది.
ఈ క్రమంలో శ్రీముఖి పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. శ్రీముఖికి పెళ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని ఓ నెటిజన్ అడిగితే.. ఫేమస్ డైలాగ్‌ను షేర్ చేసింది.. పెళ్లి గురించి ఇంకా ఆలోచన లేదని చెప్పింది.. అయితే శ్రీముఖికి పెళ్లి మీద క్లారిటీ ఉండేది. రెండు మూడేళ్లలో పెళ్లి చేసుకుని ఈ ఇండస్ట్రీకి దూరంగా ఉంటానని చెప్పింది.. కానీ తన వయసు 31 అని చెప్పింది.. మరో మూడేళ్లు అంటే 34,35 లో చేసుకుంటే ఎలా అని ఆమె ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు..