Kalki 2898 AD రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కల్కి’ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామి ఎలాంటిదో ప్రతీ రోజు మనం చూస్తూనే ఉన్నాం. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, ఈ చిత్రం హిందీ, కన్నడ, మలయాళం మరియు తమిళ భాషల్లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. భారీ వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లను నమోదు చేస్తుండడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వాస్తవానికి ఈ మధ్య కాలం లో వస్తున్న సినిమాలన్నీ కేవలం మొదటి వీకెండ్ వరకు భారీ వసూళ్లను సొంతం చేసుకొని, ఆ తర్వాత భారీ డ్రాప్స్ ని నమోదు చేసుకోవడాన్ని మనమంతా చూసాము. ప్రభాస్ గత చిత్రం సలార్ కి కూడా ఇదే జరిగింది.
కానీ కల్కి చిత్రానికి మాత్రం వర్కింగ్ డేస్ లో కూడా అద్భుతమైన వసూళ్లు రావడం విశేషం. సోమవారం నాడు ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుండి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే నిన్న కూడా ఈ చిత్రానికి 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అంటున్నారు ట్రేడ్ పండితులు. అలా ఇప్పటి వరకు జీఎస్తీ ని కూడా కలుపుకొని ఈ సినిమాకి ఆరు రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ప్రాంతాల వారీగా గమనిస్తే, నిజాం లో 62 కోట్ల రూపాయిలు, సీడెడ్ లో 14 కోట్ల 40 లక్షల రూపాయిలు, ఈస్ట్ గోదావరి లో 8 కోట్ల 80 లక్షల రూపాయిలు, వెస్ట్ గోదావరి లో 6 కోట్ల 30 లక్షల రూపాయిలు, గుంటూరు లో 8 కోట్ల 10 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో 8 కోట్ల రూపాయిలు,నెల్లూరు జిల్లాలో 4 కోట్ల 20 లక్షల రూపాయిలు.
మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కి కలిపి ఈ సినిమాకి 6 రోజుల్లో 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగ, బాలీవుడ్ లో 75 కోట్ల రూపాయిలు, కర్ణాటక లో 23 కోట్ల రూపాయిలు, కేరళలో 6 కోట్ల 80 లక్షల రూపాయిలు, తమిళనాడు లో 12 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో 80 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 325 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను, 620 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కు ని అధిగమించి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్క్ ని టచ్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.