Ileana D’Cruz : నాజూకు నడుము సుందరి ఇలియానా గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ గోవా అందం రామ్ సరసన దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించింది ఈ అమ్మడు.. రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత తెలుగులో కనిపించలేదు. అయితే కొంతకాలం క్రితం పెళ్లి చేసుకోకుండానే మగ బిడ్డకు జన్మనిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. బాబు పుట్టిన తర్వాత తన లైఫ్ పార్టనర్ ఎవరో రివీల్ చేసింది. ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంది అంటూ నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలియానాకు బలుపు ఎక్కువ అంటూ మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆయనకు ఆమెను అంత మాట అనేంత కోసం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇలియానా, చార్మి హీరోయిన్స్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కృష్ణవంశీ చెబుతూ.. చార్మి ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తుంది. కానీ ఆమెకు అన్ని ప్లాప్సే వచ్చాయంటూ వివరించాడు. ఇక రాఖీ మూవీ టైంలో ఇలియానా ఆటిట్యూడ్ నాకు అసలు నచ్చలేదంటూ చెప్పుకొచ్చిన ఆయన నేను ఆమెను ఇకపై సినిమాల్లో తీసుకోవాలని అసలు అనుకోలేదు. కానీ అప్పట్లో ఆమెకు మంచి కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి. దీంతో క్రేజ్ రీత్యా స్టార్ హీరోయిన్ అయి ఉండడంతో కొంతమంది బలవంతం మేరకు తీసుకోవాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు.
కానీ నాకు మాత్రం ఆమెను హీరోయిన్‌గా పెట్టుకోవాలని అసలు లేదు. అలాగే సినిమా చేసే టైంలో ఆమె చూపించే ఆటిట్యూడ్ నాకు అసలు నచ్చేది కాదంటూ తెలిపారు కృష్ణవంశీ. ఇక ఆమెతో సినిమా సమయంలో నేను ఆమెకు కేవలం జస్ట్ డైలాగ్స్ మాత్రమే చెప్పేవాడిని. తర్వాత ఆమె ఎవరో.. నేను ఎవరో.. అసలు తనను పట్టించుకునే వాడినే కాదని ఆయన వివరించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట్లో వైరల్ అవుతుండడంతో షాక్ అవుతున్నారు జనాలు.