Balakrishna: నందమూరి బాలకృష్ణ పై గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన బాలయ్య మాటల సందర్భంలో.. ఆ రంగారావు.. ఈ రంగారావు.. అక్కినేని తొక్కినేని అని చెప్పుకుంటూ వెళ్లారు. దాంతో అక్కినేని నాగేశ్వరావుని అవమానించారంటూ పెద్ద ఎత్తున బాలయ్య పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ కనిపించాయి.. హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ అయ్యాయి.. ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకి స్పందించి వివరణ ఇచ్చారు..
అక్కినేని నాగేశ్వరరావు నేను బాబాయ్ అని పిలిచేవాడినని బాలయ్య గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఏన్టివోడు అని అభిమానులు అప్యాయంగా పిలిచేవారు.. అలాగే నాగేశ్వరరావుని నాగయ్య అని కూడా పిలుస్తారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాషలో పిలుస్తూ ఉంటారు.. దానిని మనం తప్పు పట్టకూడదు. అందులో వారి ప్రేమను మాత్రమే చూడాలని బాలయ్య అన్నారు.
పొగడ్తలకు పొంగిపోవద్దనే సిద్ధాంతాన్ని నేను బాబాయ్ దగ్గర నుంచే నేర్చుకున్నానని బాలకృష్ణ చెప్పారు. నాగేశ్వరరావుకు నేనంటే చాలా ఇష్టం.. ఆయన తన పిల్లలకంటే ఎక్కువగా నా మీద ప్రేమ చూపించేవారు.. ఆప్యాయంగా పలకరించేవారు.. ఎందుకంటే అక్కడ (అక్కినేని కుటుంబం) నుంచి ఆప్యాయత లేదు. ఇక్కడ ఉంది.. గుర్తుపెట్టుకోండి అంటూ బాలకృష్ణ అదో మాదిరిగా నవ్వారు.
దాంతో బాలకృష్ణ మరోసారి నాగార్జునను ఉద్దేశిస్తూ ఈ కామెంట్స్ చేశారని ఆయన ఫాన్స్ అనుకుంటున్నారు. ఈ విషయంపై నాగార్జున రియాక్ట్ అవ్వనున్నారని.. మరి కాసేపట్లో నాగార్జున మీడియా ముందుకు వచ్చి ఈ విషయం గురించి చర్చించనున్నారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.