Bhumika Chawla : టాలీవుడ్ లో ఇప్పుడంతా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. మొన్న ఖుషీ.. నిన్న ఒక్కడు.. ఇలా ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలను ప్రేక్షకులు మళ్లీ ఒకసారి థియేటర్ లో ఎక్స్ పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఈ రీ రిలీజ్ ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఇది ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. మరోవైపు నిర్మాతలకు కూడా కాసుల వర్షం కురిపిస్తోంది.
స్టార్ హీరోల సూపర్ హిట్ మూవీస్ మళ్లీ థియేటర్లో రిలీజ్ అయి ప్రేక్షకులతో పూనకాలు పెట్టిస్తున్నాయి. ఈ సినిమాలు మళ్లీ చూస్తున్నప్పుడు ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేవు. కొన్నిసార్లు ఆ సినిమాలో డైలాగ్స్.. పాటలు పాడుతూ.. డ్యాన్సులు చేస్తూ.. సినిమా థియేటర్ ను ఏకంగా కన్సెర్ట్ లా మార్చేస్తున్నారు.అయితే ఈ రీ రిలీజ్ ట్రెండ్ మాత్రం ఓ హీరోయిన్ కు బాగా అచ్చొచ్చింది. ఒకప్పుడు టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు చేసి.. నెమ్మదిగా కనుమరుగై పోయి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయిన ఆ హీరోయిన్.. ఒకప్పుడు ఏ రేంజ్ స్టారో ఈ సినిమాల రీ రిలీజ్ తో ప్రేక్షకులకు మరోసారి గుర్తొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. ఇంకెవరు భూమికా చావ్లా.
రీ రిలీజ్ ట్రెండ్ లో భూమిక నటించిన మూడు సినిమాలు విడుదలై బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేశాయి. ఆమె నటించిన ఒక్కడు, ఖుషి ఇప్పటికే థియేటర్లో మళ్లీ సందడి చేయగా.. తాజాగా సింహాద్రి సినిమా మరోసారి థియేటర్ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.2003లో రిలీజ్ అయిన సింహాద్రిలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాడు. దీనికి పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అంకిత మరో హీరోయిన్. నాజర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో సింగమలై, సింహాద్రి పాత్రల్లో ఎన్టీఆర్ యాక్టింగ్ అదుర్స్. ఈ మూవీలో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ వాడిన ఆయుధం గురించి. రాజమౌళి సినిమాల్లో ఆయుధాల గురించి తెలిసిందేగా. అప్పట్లో ఈ ఆయుధం ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
రీ రిలీజ్ ట్రెండులో విడుదలైన అన్ని సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖుషి సినిమా అత్యధిక కలెక్షన్లు అందుకుంది. ఏకంగా రూ.4.50 కోట్లు వసూల్ చేసి మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 2000లో వచ్చిన యువకుడు సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది భూమిక. ఆ తర్వాత ఖుషి పేరుతో ఈ బ్యూటీ పేరు మార్మోగింది.
ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి సినిమాలతో ఈ భామ టాలీవుడ్ లో స్టార్ అయిపోయింది. తెలుగు, తమిళం, హిందీ, భోజ్ పురి, పంజాబీతో పాటు మలయాళంలోనూ ముప్పైకి పైగా చిత్రాలలో నటించింది. పవన్, మహేశ్, ఎన్టీఆర్ లకు భూమిక లక్కీ హీరోయిన్. ఈ ముగ్గురితో భూమిక నటించిన సినిమాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
2007లో యోగా టీచర్ భరత్ ఠాకూర్ ను పెళ్లి చేసుకుంది భూమిక. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. ఎంసీఏ, యూటర్న్, సవ్యసాచి వంటి సినిమాల్లో నటించింది. తాజాగా సీతారామం, సీటీమార్ సినిమాల్లో మెరిసింది.