Chiranjeevi : కొరటాల శివను చిరంజీవిటార్గెట్ చేశారా.. మెగాస్టార్ క్లారిటీ ఇదే..!

- Advertisement -

Chiranjeevi : మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మెగా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1200 థియేటర్లలో ఇది విడుదలైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మెగా మేనియా కనిపిస్తోంది.

Chiranjeevi
Chiranjeevi

చాలా రోజుల తర్వాత వింటేజ్‌ మాస్‌ లుక్‌లో చిరంజీవి కనిపించడంతో అభిమానులు సైతం ఈ చిత్రాన్ని వీక్షించేందుకు భారీగా థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి.. పాలాభిషేకాలు చేస్తున్నారు. టపాసులు, తీన్‌ మార్‌ డ్యాన్స్‌లతో థియేటర్‌ ప్రాంగణాలు హోరెత్తుతున్నాయి. ఇక ఈ సినిమా పబ్లిక్ టాక్ మామూలుగా లేదు. డోంట్ స్టాప్ షౌటింగ్.. పూనకాలు లోడింగ్ అంటూ అభిమానులంతా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.

‘వాల్తేర్ వీరయ్య’ ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి ఈ సినిమా దర్శకుడు బాబీ పనితనాన్ని ప్రశంసిస్తూ కొన్ని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవి ‘ఆచార్య’ డైరెక్టర్ కొరటాల శివను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా అటాక్ చేశారని పుకార్లు వచ్చాయి. కానీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చిరంజీవి ఆ రూమర్స్ కు చెక్ పెట్టారు. ఇంతకీ చిరంజీవి కొరటాలపై చేసిన వ్యాఖ్యలేంటి.. వాటికిచ్చిన క్లారిటీ ఏంటి ఓసారి చూద్దామా..?

- Advertisement -
Mega Star Chiranjeevi
Mega Star Chiranjeevi

ఫిలిం ఇండస్ట్రీకి మంచి జరగాలంటే దర్శకులు ఎలా పని చేయాలో ఈ మధ్య చాలా వేదికలపై చిరంజీవి చెప్పుకొచ్చారు.  ఆయన ఈ టాపిక్ తీసిన ప్రతిసారి ‘ఆచార్య’ దర్శకుడు కొరటాల శివను ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్ చేస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ తాను ఆ దర్శకుడిని ఎప్పుడూ టార్గెట్ చేయలేదని చిరంజీవి తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.


“ఇండస్ట్రీ బాగుండాలంటే ప్రతి దర్శకుడు సెట్స్‌కు వెళ్లే ముందే ప్రతి అంశాన్ని పేపర్‌పై వర్కవుట్ చేయాలని చెప్పాను. నాలుగు గంటల నిడివితో సినిమా షూటింగ్ చేసి ఆ తర్వాత ఒక గంట లెంగ్త్‌ను ట్రిమ్ చేయడం కంటే.. పర్ఫెక్ట్‌గా మూడు గంటల్లోపే షూటింగ్ చేసేవిధంగా పక్కాగా స్క్రీన్‌ప్లే రూపొందించడం ఉత్తమం. దీంతో ప్రొడక్షన్ ఖర్చు ఆదా అవుతుంది. ఇది సాధారణ ప్రకటనే తప్ప కొరటాల శివనను ఉద్దేశించిన వ్యాఖ్య కాదు. కొరటాల‌ను నేను టార్గెట్ చేయ‌లేదు. ఆయ‌న‌పై ఎలాంటి కామెంట్స్ చేయ‌లేద‌ని మరోసారి క్లారిటీ ఇస్తున్నాను” అని చిరంజీవి అఫిషియ‌ల్‌గా క్లారిటీ ఇచ్చారు.

అయితే, ‘ఆచార్య’ సినిమా ఫ్లాప్ అయ్యేందుకు ఆ సినిమా డైరెక్టర్ కొరటాల శివ నిర్లక్ష్యమే కారణమని, అతను సినిమా కథపై కాకుండా బిజినెస్ వ్యవహారాలపై ఫోకస్ చేశాడని నెట్టింట అనేక కామెంట్స్ వినిపించాయి. పైగా ‘లాల్ సింగ్ చద్దా’ ప్రమోషన్‌లో భాగంగా అమీర్ ఖాన్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కూడా చిరంజీవి టాలీవుడ్‌లో కొంతమంది దర్శకుల పనితీరుపై బాహాటంగానే కామెంట్ చేశారు. అంతకుముందే ఆచార్య ఫ్లాప్ కావడంతో ఈ చిత్ర దర్శకుడు ‘కొరటాల శివ’ గురించే చిరు మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో చాలా పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఈ రూమర్స్ అన్నింటికి చిరంజీవి ఒక్కసారిగా చెక్ పెట్టారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here