Actor Yash : యష్ జీవితంలో ఎన్నో మలుపులు..పెళ్లి తో పాటు అది కూడా..

- Advertisement -

Actor Yash : కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..ఇటీవలే ఆయన తన 38 వ పుట్టిన రోజును జరుపుకున్నారు..కెజిఎఫ్’ చిత్రంతో, యష్ కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతిని సంపాదించారు. వినోద ప్రపంచంలో అతనిది అందెవేసిన చేయిగా మారింది. బస్సు డ్రైవర్ కుమారుడి స్థాయి నుండి సూపర్ స్టార్ అయ్యే వరకు యష్ కథ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. యష్ నిజ జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Actor Yash
Actor Yash

కన్నడ సూపర్ స్టార్ యష్ 1986 జనవరి 8న కర్ణాటకలోని హాసన్ నగరంలోని బోవనహళ్లి గ్రామంలో జన్మించారు. కేజీఎఫ్ స్టార్గా అభిమానులు, పరిశ్రమ జనాలకు అతని పేరు యష్ అని తెలుసు, కానీ అతని అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. అతని మరొక పేరు ‘యశ్వంత్’. అతను ఈ పేరును యష్గా కుదించారు.. ఇప్పుడు అతని పేరు తెలియని వాళ్ళు ఉండరు.. కానీ ఒకప్పుడు మాత్రం అతని పేరు ఆ వీధిలో కూడా తెలియదు..అతని తండ్రి అరుణ్ కుమార్ గౌడ కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో బస్సు డ్రైవర్గా పనిచేశారు. అతని తల్లి గృహిణి..

Actor Yash Family
Actor Yash Family

నటనపై ఇష్టంతో యష్ తన పాఠశాల చదువును విడిచిపెట్టాలని అనుకున్నారు. అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువు పూర్తి చేశారు. యష్ తండ్రి తన కుమారుడు కూడా తనలాగే ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్నారు. తండ్రి కుమారుని ఇష్టాన్ని వ్యతిరేకించారు. అయిన యష్ కు అదృష్టం కలిసి వచ్చింది..2007లో ‘జంబద హుడుగి’ సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టారు..2008లో వచ్చిన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘రాకీ’లో యష్ తొలిసారిగా ప్రధాన నటుడిగా ఎంపికయ్యాడు. యష్ తన రెండవ చిత్రం ‘మొగ్గిన మనసు’ సెట్లో రాధిక పండిట్ను కలిశారు..అది కాస్త స్నేహంగా మారింది..అలా ప్రేమగా మారింది.2012 లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ సినిమాతో యష్కి పాపులారిటీ రావడమే కాకుండా జీవిత భాగస్వామి కూడా దొరికింది. యష్, రాధిక దంపతులకు ఇద్దరు పిల్లలు, కుమార్తె ఐరా 2018లో జన్మించింది. కుమారుడు యథర్వ యష్ ఒక సంవత్సరం తరువాత జన్మించాడు..ఇప్పుడు యష్ పేరు కన్నడ ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here