Veera Simha Reddy First Review : సంక్రాంతికి మరింత జోష్ పెంచేందుకు స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి.. బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి కూడా సంక్రాంతి బరిలో ఉంది..ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 1700 థియేటర్లలో ఫస్ట్ డే ప్రదర్శితం కానుందని సమాచారం అందుతోంది.ఇప్పటికే బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ ఆల్రెడీ మొదలయ్యాయి. 2 గంటల 50 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. నిడివి ఎక్కువైనా కంటెంట్ ఆకట్టుకునేలా ఉండనుందని సమాచారం. మొన్నీమద్య విడుదల చేసిన ట్రైలర్ తో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి..
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ రాగా సెన్సార్ సభ్యులు ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందించారని సమాచారం అందుతోంది. అయితే ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు కూడా ఈ సినిమా గురించి స్పందిస్తూ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఈ సినిమాకు ఆయన ఏకంగా 3.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. బాలయ్య నటన ఈ సినిమాకు హైలెట్ అని ఆయన చెప్పారు.
అంతేకాదు బాలయ్య బాబును గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలో చూడవచ్చునని అన్నారు..క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు. కథ, కథనం మరీ కొత్తగా లేదని అయితే యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పాటలు, డ్యాన్స్ లు బాగున్నాయని కొన్ని ఎమోషనల్ సీన్స్ ఒకేలా ఉండబోతున్నాయని సమాచారం.
వరలక్ష్మి బాలయ్యకు సొంత చెల్లి కాదని ఆమె నటనే సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. క్రాక్ సినిమాలోని జయమ్మ రోల్ ను మించి రోల్ ఈ సినిమాలొ ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వీరసింహారెడ్డి సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి..ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పాలి..ఇక కలెక్షన్స్ మాట ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..