Silk Smitha : ప్రేక్షకులకు సెలబ్రిటీలు ఓ రోల్ మోడల్.. వారిలా స్టైల్‌గా ఉండాలని వాళ్లనే అనుకరించే వారు చాలా మందే ఉంటారు. అంతేకాదు వారు వాడిన వస్తువులను వాడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది కుదరకపోతే కొనుగోలు చేసైనా వారు ఉపయోగించిన వస్తువును దక్కించుకోవాలన్న ఆశ వారిలో ఉంటుంది. అందుకే సినీ సెలబ్రిటీలు ఉపయోగించిన వస్తువులను వేలానికి పెడతారు. అలా ఒకప్పుడు సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్‌కు వేలం నిర్వహించారు. అప్పట్లో దీనిని చూసి అందరూ ఒకింత షాకయ్యారు. తాజాగా ఇన్నాళ్లకు ఆ వేలం పాట వార్త చర్చల్లోకి వచ్చింది.
సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు బోల్డ్ పాత్రలు చేసి సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది సిల్క్ స్మిత. అప్పట్లో సిల్క్ ఐటమ్ సాంగ్ లేకుండా సినిమా ఉండేది కాదు. ఎంతోమంది స్టార్ హీరోలతో స్టెప్పులేసి, ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నర్తించింది. తను సినిమాల్లో నటించిన ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. తన చావు కూడా అలా సెన్సేషన్ అయింది. అసలు తను ఎందుకు చనిపోయిందన్న విషయం ఇప్పటికీ మిస్టరీనే. అప్పట్లో సిల్క్‌కు ఉన్న క్రేజ్ తెలుసుకోవడానికి ఓ ఉదాహరణ చెప్పుకుందాం.
ఓ సారి సిల్క్.. సినిమా షూటింగ్లో ఉంది. ఆ షూటింగ్ బ్రేక్‌లో తను ఓ యాపిల్ తింటున్నారట. మేకర్స్ వచ్చి షాట్ రెడీ అని చెప్పడంతో తింటున్న యాపిల్ అక్కడే వదిలేసి వెళ్లిపోయిందట. ఆ టైంలో షూట్లో ఉన్న ఓ వ్యక్తి దానిని తీసుకుని పారిపోయాడట. తర్వాత దానికి వేలం నిర్వహించాడట. కానీ అది ఎంత ధర పలికిందనేది మాత్రం స్పష్టంగా తెలియదు. కొందరు రూ.2అన్నారు. మరికొందరు రూ.200. ఇంకొకరు ఏకంగా రూ.లక్ష పలికిందని అన్నారు. నిజమేంటో మాత్రం తెలియదు. సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా ‘ది డర్టీ పిక్చర్’ అనే సినిమా కూడా వచ్చింది.