అయ్యో సామ్ ఇలా అయ్యావేంటి.. యశోద ప్రమోషన్స్ లో సమంతని చూసి ఫ్యాన్స్ షాక్

- Advertisement -

టాలీవుడ్ జెస్సీ సమంత రుత్ ప్రభు కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో సామ్ గత కొంతకాలంగా సోషల్ మీడియా నుంచి మాయమైపోయింది. సామ్ కి ఏమైందోనని ఫ్యాన్స్ తెగ బాధ పడిపోయారు. అయితే ఇటీవలే తను మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నట్లు పోస్ట్ చేసింది. ఇన్నాళ్లూ తాను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడానికి కారణం తన అనారోగ్యమేనని క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా సమంత మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఈనెల 11న తన మూవీ యశోద రిలీజ్ అవుతోంది. కానీ తన అనారోగ్యం కారణంగా సామ్ ఈ సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటోంది.

అయ్యో సామ్ ని చాలా మిస్ అవుతున్నామని బాధపడుతోన్న ఫ్యాన్స్ కి సమంత ఓ గుడ్ న్యూస్ చెప్పింది. యశోద మూవీకి సంబంధించి సమంత ఒకే ఒక్క ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నట్లు చెప్పింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో, బ్లాక్ కళ్లద్దాలతో సామ్ మెరిసిపోతోంది. కానీ తాను అనారోగ్యం బారిన పడిందనే విషయం కళ తప్పిన సామ్ ముఖంలో క్లియర్ గా కనిపిస్తోంది. ఇక సామ్ పోస్ట్ చేసిన ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఓ వైపు ఖుష్ అవుతూనే సామ్ ఇలా అయ్యిందేంటని బాధ పడుతున్నారు.

- Advertisement -

సమంత త్వరగా కోలుకోవాలని తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. ‘యశోద’ చిత్రంలో సమంతా సరోగేట్ మదర్ గా కనిపించనుంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. దర్శకద్వయం హరి & హరీశ్ తెరకెక్కించారు. దీనికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here