బాలీవుడ్ స్టార్ కిడ్స్ ఏం చేసినా సెన్సేషనే. ముఖ్యంగా వారి స్నేహం, ప్రేమకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడతాయి. స్టార్ కిడ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రిలేషన్ షిప్ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో తన ఫస్ట్ కో స్టార్ అయిన ఇషాన్ ఖత్తర్ తో జాన్వీ ప్రేమలో ఉందంటూ పుకార్లు వచ్చాయి. తర్వాత అతడితో బ్రేకప్ అయింది. అప్పటి నుంచి జాన్వీ సింగిల్ గా ఉంది.
తాజాగా ఓ బిజినెస్ మెన్ కుమారుడు ఒర్హాన్ తో జాన్వీ కపూర్ ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా ఆమె పెదవి విప్పింది. మిలీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ.. ఒర్హాన్ గురించి మాట్లాడింది.
అతడితో ఉంటే తాను ఎప్పుడూ సంతోషంగా ఉంటానని చెప్పింది జాన్వీ. ‘‘ఒర్హాన్ నాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. అతడితో ఉంటే నేను ప్రతిక్షణం ఆనందంగానే ఉంటా. అన్ని విషయాల్లోనూ ఎంతో కాలం నుంచి అండగా నిలిచాడు. అతడిని ఎంతో నమ్ముతున్నాను. అతడు నా పక్కన ఉంటే మా ఇంట్లో ఉన్నాననే భావన కలుగుతుంది’’ అని తెలిపారు.
ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన ఒర్హాన్‌తో జాన్వి ఎంతోకాలం నుంచి స్నేహం చేస్తోంది. బీటౌన్ ఫంక్షన్స్‌లో వీరిద్దరూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. పార్టీలు, డిన్నర్లు, విదేశీ టూర్లు.. ఇలా ఎక్కడికైనా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. దీంతో ఈ జంట ప్రేమలో ఉందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గానూ మారాయి. ఇప్పుడు జాన్వీ చెప్పిన మాటలు వింటుంటే వీరిద్దరూ రిలేషన్లో ఉన్న మాట వాస్తవమే అయి ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు.