హీరోయిన్ పూర్ణ ( Poorna ) గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు.. హీరో అల్లరి నరేష్ నటించిన సీమటపాకాయ్ సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది..ఈ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు అనుకున్న హిట్ ను అందుకోలేక పోయిన నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి..వెండి తెరపై హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేదు..దాంతో బుల్లి తెరపై కూడా కాలు మోపింది. ఢీ షోలో జడ్జిగా వ్యవహరించింది. తాజాగా పూర్ణ దుబాయ్ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి కూడా చేసుకుంది. ఇక ఈ మధ్యకాలంలో పూర్ణ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఇది ఇలా ఉండగా..ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా డైరెక్టర్, యాక్టర్ అయినటువంటి రవి బాబు సినిమాల్లో చేసింది. ఇక ఎక్కువగా ఆయన సినిమాల్లో చేసే క్రమంలో వారిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ అప్పటిలో ఎన్నో వార్తలు వచ్చాయి. అంతేకాదు పూర్ణ విషయంలో రవిబాబు ఏదో మిస్ బిహేవ్ చేస్తే అందువల్ల అప్పటినుంచి ఇక రవిబాబు సినిమాల్లో చేయకూడదు అని పూర్ణ నిర్ణయం తీసుకుంది అంటూ ఎన్నో వార్తలు వినిపించాయి..
ఈ విషయం పై డైరెక్టర్ రవిబాబు స్పందించారు.. నా సినిమాల్లో ఆమె చేస్తుంది.. కేవలం మా మధ్య ఆ సంబంధం మాత్రమే వుంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో ఒక హీరోయిన్ దొరుకుతుంది అంటే ఎవరైనా అదే హీరోయిన్ తో చాలా సినిమాలు చేస్తారు. అందుకే నేను కూడా ఆ హీరోయిన్ పెట్టి ఎక్కువ సినిమాలు చేశాను. అయితే అవును సినిమా షూటింగ్లో పూర్ణ గారి విషయంలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది.. ఏనుగు చేతిలో చిక్కుకున్నట్లు ఫోటో కావాలని అనుకున్నాము.. అంతేకాదు ఆ ఫోటోల కోసం పూర్ణ ని ఏకంగా గంట పాటు తాడుతో కట్టి వేలాడదీశాం. అయితే అలా తీసే సమయంలో కెమెరామెన్ కెమెరాలో చిప్ పెట్టుకోవడం మర్చిపోయాడు..
ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా నాకు చెప్పాడు.. అయితే ఈ విషయం నేను పూర్ణాకి చెప్పగానే ఆమె కోపంతో ఊగిపోయింది.కానీ చేసేదేమీ లేక మళ్ళీ ఆమెను గంటపాటు తాడుకు వేలాడదీయాల్సి వచ్చింది. ఇలా ఆమె ఏకంగా రెండు గంటల పాటు తాడుకు వేలాడదీసి ఫోటో షూట్ చేశాడు..దాంతో పూర్ణ అతడి చేతిలో బలైంది..అని డైరెక్టర్ చెప్పాడు.అయితే రవిబాబు అప్పుడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో చాలా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా తీశాక రవిబాబు దర్శకత్వంలో నటించడం ఇష్టం లేదు తర్వాత చెయ్యలేదు..ఇప్పుడు అడపా దడపా సినిమాలను చేస్తూ వస్తుంది.