జూనియర్ సమంతగా పిలుచుకునే అషూరెడ్డి ( Ashu Reddy ) స్కిన్ షోకు రోజురోజుకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. రోజు రోజుకు బోల్డ్నెస్ పెరిగిపోతోంది. ముఖ్యంగా కాంట్రవర్సికీ కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో అషూరెడ్డి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇద్దరూ కలిస్తే ఇక సోషల్ మీడియాకు మామూలు మసాలా కంటెంట్ దొరకదు. వీళ్లిద్దరు ఎప్పుడు కలిసినా ఓ సెన్సేషనే.
రీసెంట్గా ఆర్జీవీ తన లేటెస్ట్ మూవీ డేంజరస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇద్దరమ్మాయిల ప్రేమ కథతో వస్తోన్న సినిమా ఇది. అందుకు తగ్గట్టుగానే ఆర్జీవీ తన ప్రమోషన్స్‌కి కూడా అమ్మాయిలనే వాడుతున్నాడు. ఇటీవలే కొందరు అమ్మాయిలతో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవీతో పాటు ఆ అమ్మాయిలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరో ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు.
ఆర్జీవీ తన డేంజరెస్ మూవీ కోసం బోల్డ్ బ్యూటీ అషూరెడ్డితో కలిసి ఓ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో.. ఫొటోస్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే అషూ రెడ్డి తన అందాలను హద్దులు చెరిపేస్తూ షో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం దాచుకోకుండా కుర్రాళ్లకు బ్యూటీ ట్రీట్ ఇస్తోంది అషూరెడ్డి. గ్యాప్ లేకుండా తన గ్లామర్ షోతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. తన ఫొటోషూట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇప్పటికే ఒకటి రెండు సార్లు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మతో ఇంటర్వ్యూలు చేసింది అషూరెడ్డి. ఆ ఇంటర్వ్యూల్లోనూ ఆర్జీవీ అషూ అందాలను సరికొత్తగా ఆవిష్కరించాడు. కెమెరా యాంగిల్స్‌ను చిత్రవిచిత్రంగా పెడుతూ అషూరెడ్డిని హాట్‌గా చూపించాడు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి ఇంటర్నెట్ను బ్లాస్ట్ చేశారు. తాజాగా వర్మ కాంపౌండ్‌లో మెరిసింది అషూరెడ్డి. వర్మ అషూరెడ్డి కాళ్లు పట్టుకుని కనిపించాడు. కెమెరాను అషూరెడ్డి బ్యాక్‌లో పెట్టి బ్యాక్ నుంచి ఆమె థైస్ కనిపించేలా ఫోకస్ చేశాడు. ఆర్జీవీ అషూ ఎదుట కూర్చొని ఆమె థైస్‌ను చూస్తూ.. కాళ్లొత్తుతున్నాడు. ఈ సీన్ చూస్తుంటే ఆర్జీవీ ఏదో మైకంలో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు ఈ ఫొటోలు ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఫొటోలను అషూ రెడ్డి, రామ్‌గోపాల్ వర్మ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. డేంజరస్ వర్మతో డబుల్ డేంజరస్ అషూరెడ్డి అంటూ పోస్ట్ పెట్టిందీ బిగ్ బాస్ బ్యూటీ. వీరిద్దరు కలిసి ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. వర్మ రూపొందించిన `డేంజరస్` మూవీ ఈ నెల 9న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా వర్మ ఇలా అషూరెడ్డితో కలిసి ఇంటర్వ్యూ చేశాడు.
ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. బోల్డ్‌గా కామెంట్లు పెడుతున్నారు. ఎంత లెజెండరీ దర్శకుడు అయినా, ఏదో ఒకరోజు అమ్మాయి కాళ్ల వద్దకు రావాల్సిందే అనే సందేశాన్ని వర్మ జనానికి ఇస్తున్నాడని, ఎంత బతుకు బతికి చివరికి ఏ స్థితికి చేరావు వర్మ అని, ఫేమ్ కోసం ఇంత దిగజారిపోయావా? అని, అదృష్టం అంటే వర్మదే అని, ఇప్పుడు అనిపిస్తుంది ఒక్క రోజైనా వర్మలా బతకాలని అంటూ కామెంట్లు పెడుతున్నారు.