గోపిచంద్ Gopichand గురించి అందరికి తెలుసు..మంచి నటుడు..ఇటీవల కాలంలో ఇతను చేసిన సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..అతని సినిమాలు పెద్దగా హిట్ అవ్వక పోవడానికి అసలు కారణం రోమాన్స్..అతను రొమాన్స్‌కు కాస్త దూరంగా ఉంటారు..దీంతో యూత్ ఆ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించరని చాలా సందర్భాల్లో రుజువైంది..ఒక హీరో అయ్యి ఉండి రొమాన్స్ చెయ్యకుంటే ఎలా అనే సందేహం కలుగుతుంది కదూ..దాని గురించి వివరంగా తెలుసుకుందాం…
అవకాశాలు వస్తే సరిపోదు ..వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే బుర్ర కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఫ్లాప్ అవుతున్న హీరోలకి బుర్ర లేదా అని కాదు వచ్చిన అవకాశాలని ఉపయోగించుకునే అంత దమ్ము మనలో ఉండాలి అన్నది మెయిన్ పాయింట్..గోపిచంద్ ఈ కోవకు చెందినవాడే..గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు . సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయిన గోపీచంద్.. తొలివలపు అనే సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్నాడు.
ఈ సినిమాలో గోపీచంద్ నటన చాలామందికి నచ్చేసింది. అంతేకాదు సైలెంట్ లుక్స్ తో రాముడు మంచి బాలుడు అనే టైపులో నటించాడు . సినిమాలోనే కాదు బయట ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అదే. గోపీచంద్ చాలా సైలెంట్. ఎవ్వరి జోలికి వెళ్లడు. తన జోలికి వచ్చినా పట్టించుకోడు. అంత సైలెంట్. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో జరిగే అరాచకాలు అన్ని తెలిసినా కానీ సైలెంట్ గా ఉంటాడు. అది తప్పో ఒప్పో ఆయనకే తెలియాలి . అయితే మంచి హైట్ -వెయిట్- ఫిజిక్ .. ఆ కటౌట్ చూసి టెంప్ట్ అయిపోయే హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు .
అయితే ఇతను బెండు అవ్వడని తెలుస్తుంది.గోపీచంద్ లో రొమాంటిక్ ఫీలింగ్స్ చాలా తక్కువ . సినిమా పరంగా ఏదైనా హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ చేయమంటే సిగ్గుపడతాడట . భయపడిపోతాడట. హీరోయిన్ టచ్ చేయడానికి కూడా పది సార్లు ఆలోచిస్తాడట . మరి అలాంటి హీరో ఇండస్ట్రీలో నెట్టుకు రాగలడా..? అసలు హీరోయిన్ సెంటీమీటర్ చనువు ఇస్తే కిలోమీటర్ దూసుకుపోయే హీరోలు ఉన్న ఈ కాలంలో అమ్మడు సిగ్నల్ ఇచ్చిన అర్థం చేసుకోలేని గోపీచంద్ అందుకే స్టార్ హీరో అవ్వలేకున్నాడని టాక్..
కాగా, ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటిలో రొమాంటిక్ సీన్స్ లో గోపీచంద్ ఎంత ఇబ్బందికరంగా నటించాడో స్క్రీన్ పై క్లియర్‌గా తెలిసిపోతుంది . అయితే రియల్ లైఫ్ లో సైలెంట్ బాయ్ గా ఉన్న గోపీచంద్ రియల్ లైఫ్ లో మాత్రం మంచి రసికుడే.. ఇద్దరు పిల్లలు,భార్యతో సంతోషంగా ఉన్నాడు..ఏది ఏమైనా కూడా అతనికి ఒక హిట్ పడాలని ఆశిద్దాము..