Mahesh Babu : రియల్ హీరో మహేష్ బాబు గురించి మరి కొన్ని విషయాలు..!

- Advertisement -

మహేష్ బాబు సినిమాలలోనే కాదు. నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు.. ఎందరికో జీవితాన్ని ఇచ్చాడు. మరెందరికి ఆసరాగా, ఆదర్శంగా నిలిచాడు.. కొంత మందికి మాత్రమే అతని జీవితం గురించి తెలుసు.. అందమైన నవ్వు వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.. ప్రిన్స్ Mahesh Babu గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
తెలుగు చిత్ర పరిశ్రమలో కి మొదట చైల్ద్ ఆర్టిస్టు గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.

అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసును చూరగొన్నాడు.. మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లను నిర్వహిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఇలా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు.

- Advertisement -
mahesh babu helping hands
mahesh babu helping hands

అంతేకాదు..రెండు గ్రామాలను కూడా దత్తత తీసుకొని ఆ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆ గ్రామాలలో మౌలిక సదుపాయాలను సమకూర్చిన మహేష్ బాబు మరోసారి తన ఫౌండేషన్ ద్వారా తన దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలోని గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటిని సమకూర్చారు.మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా మరో అడుగు ముందుకు వేసి ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ క్లాసులను ప్రారంభించారు..
విద్యార్థులకు కంప్యూటర్లను పంపిణీ చేసి డిజిటల్ లెర్నింగ్ తరగతులలో శిక్షణ ఇప్పిస్తున్నట్లు నమ్రత సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

మహేష్ బాబు ఫౌండేషన్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టిందని విద్యార్థుల డిజిటల్ లెర్నింగ్ కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేసింది..ఇందుకు సంబందించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది… మహేష్ బాబు అభిమానులు అలాగే నేటిజన్స్ మహేష్ బాబు మంచితనం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులకు తప్పనిసరిగా కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం ఈ క్రమంలోనే గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ విధంగా కంప్యూటర్లను సమకూర్చి డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలను అందించడం పట్ల ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.. అంతేకాదు ఇటీవల ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి, వారి జీవితానికి వెలుగు నింపారు..రియల్ హీరో అయ్యాడు..ఆయన సినిమాల విషయాన్నికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో  ఓ సినిమా చేస్తున్నారు.. ఆ తర్వాత రాజమౌళి సినిమాలో నటించనున్నాడు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here