Nandamuri Mokshagna : ఫ్యాన్స్‌కు బాలయ్య బాబు గుడ్‌న్యూస్.. మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ

- Advertisement -

నందమూరి బాలకృష్ణ తెలుగు వెండితెరపై దశాబ్ధాలుగా వెలుగులీనుతున్న కథానాయకుడు. క్లాస్, మాస్, ఊర మాస్‌, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఐదు పదులు దాటిన వయసులోనూ చలాకీగా ఫైట్లు చేస్తూ.. హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ ఆడియెన్స్‌ను అలరిస్తున్నాడు. ఇక బాలయ్య స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. ఇటీవల అఖండ మూవీతో అఖండ విజయం సాధించిన బాలయ్య నెక్స్ట్ వీరసింహా రెడ్డి సినిమాతో మరోసారి తన రాజసం చూపించేందుకు రెడీ అవుతున్నాడు.

Nandamuri Mokshagna
Nandamuri Mokshagna

 

సినిమా ఇండస్ట్రీలో వారసులు రావడం సర్వసాధారణం. ఇప్పటికే మహేశ్ బాబు, రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, రానా ఇలా వారసులు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. బ్యాక్‌గ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చినా తమకంటూ గుర్తింపు తెచ్చుకుని కొందరైతే తండ్రుల్ని మించిన తనయులయ్యారు. ఇప్పుడు ఆ కోవలోకే రాబోతున్నాడ మోక్షజ్ఞ. నందమూరి బాలకృష్ణ.. తన తనయుడు Nandamuri Mokshagna ను ఎప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

- Advertisement -

ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఎప్పుడు బాలకృష్ణని అడిగినా మాట దాటవేసేవాడు. అయితే తాజాగా బాలయ్య బాబు గోవా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. అక్కడ బాలకృష్ణ.. మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. తన కుమారుడిని వచ్చే ఏడాది టాలీవుడ్‌లోకి పరిచయం చేయనున్నట్లు చెప్పాడు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య చెప్పలేదు. మోక్షజ్ఞను బోయపాటి శ్రీను లాంచ్‌ చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన మాట్లాడుతూ.. “అంతా దైవేచ్ఛ” అని నవ్వి ఊరుకున్నాడు.

అనంతరం ‘అఖండ-2’పై స్పందించాడు. ”అఖండ-2’ తప్పకుండా ఉంటుంది. సబ్జెక్ట్ కూడా సిద్ధం చేశాం. ప్రకటించడం ఒకటే మిగిలింది. సమయం చూసి ప్రకటిస్తాం’’ అని బదులిచ్చాడు. గోవాలో నిర్వహిస్తోన్న 53వ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఇటీవల ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ మేరకు చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి సందడి చేశారు. ఇక, బాలయ్య ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహా రెడ్డి’ సినిమా చేస్తున్నాడు. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఇది తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

బాలయ్య తన పుట్టిన రోజున కూడా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడాడు. మోక్షజ్ఞ త్వరలోనే వెండితెరపై కనిపిస్తాడని చెప్పాడు. ‘అది కూడా ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడి చేతిలో తన వారసుడిని బాలకృష్ణ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ఉప్పెన సినిమాతో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు.. నందమూరి వారసుడిని పరిచయం చేసే బాధ్యత తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ మధ్య ఉప్పెన సినిమా ప్రత్యేకంగా కుటుంబంతో పాటు చూశాడు బాలకృష్ణ. సినిమా చూసిన తర్వాత చాలా సేపు బుచ్చితో మాట్లాడాడు బాలయ్య. ఎంతో అద్భుతంగా తీసావ్ అంటూ ప్రశంసించాడు కూడా.

అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ తనకు అఖండ విజయాన్ని అందించే బోయపాటి భుజాలపై వేసినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒకవేళ మోక్షజ్ఞ తొలి సినిమా బోయపాటితో ఉంటే మాత్రం.. తను మాస్ హీరోగా ఎంట్రీ ఇస్తాడు. లేదా బుచ్చిబాబుతో చేస్తే ఒక లవర్ బాయ్‌గా ఎంట్రీ ఉంటుంది. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞను తన తండ్రిలాగే ఊర మాస్ పాత్రలో చూడాలని ఎదురుచూస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here