టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోజురోజుకు స్టైలిష్ గా రెడీ అవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ అయిన జోష్ లో ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైన ఫోకస్ చేశాడు. సినిమాలే కాకుండా తారక్.. యాడ్స్ కూడా చేస్తున్నాడు. రీసెంట్ గా తారక్ ది ఐ స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాస్ మనసున్న ఎన్టీఆర్ క్లాస్ లుక్ అంటూ ఫ్యాన్స్ తెగ లైకులు కొట్టేశారు.
అయితే తారక్ న్యూ లుక్ ఏ సినిమా కోసం అని అందరూ తెగ ఆలోచించడం షురూ చేశారు. అయితే ఆ లుక్ సినిమా కోసం కాదనే విషయం రీసెంట్ గా తెలిసిపోయింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ యాడ్ వీడియో చూస్తే ఎన్టీఆర్ న్యూ లుక్ ఎందుకోసమే అర్థమైపోతోంది. మరి మీరు ఈ వీడియో చూశారా.. లేకపోతే ఇక్కడ చూసేయండి..!
మీట్ డెలివరీ ప్లాట్‌ఫాం లీషియస్ ప్రమోషన్స్ లో భాగంగా డిజైన్ చేసిన యాడ్ కోసం కొత్త గెటప్‌లోకి మారాడు తారక్. ఆరు పేజీల డైలాగ్‌ను అర సెకన్లో చెప్పేసే మీకు ఇంత చిన్న డైలాగ్‌కు అంత టైం అని రాహుల్ రామకృష్ణ అంటుండగా.. చేప చిన్నదైనా ఎర పెద్దదెయ్యాలి.. అంటూ లీషియస్ గురించి ప్రమోట్ చేస్తున్నాడు తారక్. కోర్టులో ఫన్నీగా సాగే ఈ యాడ్ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ కనిపించని సరికొత్త లుక్‌లో తారక్ కనిపించబోతున్నాడట.
When NTR Jr's perfection met Licious' perfection 😍
"Man of the Masses" @tarak9999 has tried it! Mari merepudu Licious try chestunaru?#NtrJr #Licious #LiciousNatakalu pic.twitter.com/DFNMzdTiI5
— BA Raju's Team (@baraju_SuperHit) November 23, 2022