మూవీ మొఘల్ మనవడిగా.. టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ కొడుకుగా.. విక్టరీ వెంకటేశ్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు Rana Daggubati. స్ట్రాంగ్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కాంపౌండ్ నుంచి అడుగుపెట్టినా.. తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. తొలి సినిమా లీడర్‌తో తనలోని నటనను ప్రేక్షకులకు చూపించిన రానా.. ఆ తర్వాత నేను నా రాక్షసి అంటూ తనలోని మాస్ యాంగిల్ బయటపెట్టాడు. ఇక అప్పటి నుంచి రొటీన్ స్టోరీల జోలికి వెళ్లకుండా తనకు వస్తోన్న ఆఫర్లలో తన కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసే కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకున్నాడు.
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తోన్న రానా స్వతహాగా ప్యాన్ ఇండియా స్టారే. కానీ తనకు ప్యాన్ ఇండియాలో గుర్తింపు తెచ్చింది మాత్రం బాహుబలి సినిమాలోని బల్లాల దేవ పాత్ర. ఆ మూవీ తర్వాత రానా స్టార్డమ్ అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. బాహుబలి ఇచ్చిన కిక్‌తో రానా విభిన్న కథనాలు ఎంచుకుంటూ అందరికంటే వైవిధ్యమైన రూట్లో వెళ్తున్నాడు. ఇక ఇటీవల వచ్చిన విరాటపర్వంలోని రవన్న పాత్రలో రానా లుక్, డైలాగ్స్, యాక్టింగ్ చూసి ఫిదా కానీ వారంటూ లేరు.
టాలీవుడ్లో ఉన్న హీరోల్లందరిలో రానా కెరీర్ ఓ డిఫరెంట్ రూట్లో నడుస్తుంది. తన పాత్రకు బలం ఉందనిపిస్తే చాలు ఎలాంటి క్యారెక్టర్లోనైనా నటించేస్తాడు. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ యాక్టర్, విలన్ ఇలా తేడా లేకుండా తనలోని నటనను, వర్సటాలిటీని బయటపెట్టేస్తుంటాడు. ఇక నేటి తరం హీరోల్లో రానా లాగా డైలాగ్ డిక్షన్ ఉన్న వాళ్లు చాలా అరుదు.
ఇంతటి వర్సటైల్ యాక్టర్ రానాలో ఓ రొమాంటిక్ యాంగిల్ దాగుంది. పెళ్లికి ముందు రానాకు ప్లే బాయ్ అనే ట్యాగ్ ఉండేదట. అయితే మిహికా బజాజ్‌తో వివాహానికి ముందు రానా చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడనేది ఇండస్ట్రీ టాక్. అందరి సంగతి పక్కన బెడితే.. పెళ్లికి ముందు వరకు ఓ హీరోయిన్‌తో గాఢమైన ప్రేమలో ఉన్నాడట రానా.
రానా చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపాడట. మిహికాతో పెళ్లికి ముందు రానా కన్నడ నటి రాగిణి ద్వివేదిని ప్రేమించినట్టు టాక్. రానా – రాగిణీ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆమె 2009లో కన్నడలో వచ్చిన వీర మడక్కరి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తెలుగులో నాని హీరోగా వచ్చిన జెండా పై కపిరాజు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో ఆమెను ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు.
వీరిద్దరికి మోడలింగ్ చేసే రోజుల్లో పరిచయం ఏర్పడి ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి అప్పట్లో. రాగిణి హీరోయిన్ అయ్యే ముందు మోడలింగ్ చేసింది. రానా కూడా మోడల్ కావడంతో ఏదైనా షోలో కలిసి ఉంటారనే చర్చ నడుస్తోంది. ఆ క్రమంలోనే వీళ్ల మధ్య ప్రేమ చిగురించి ఉంటుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి రానా రాగిణిని వదిలేసి మిహికాను ఎందుకు పెళ్లి చేసుకున్నాడనే విషయంపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. రాగిణి కంటే ముందు చెన్నై చిన్నది త్రిషతో కూడా రానా ప్రేమాయణం సాగినట్లు టాక్.