Anu mehta : గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన ‘ఆర్య’ మూవీ హీరోయిన్ ని చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

- Advertisement -

Anu mehta : కొంతమంది హీరోయిన్లు తళుక్కుమని రెండు మూడు సినిమాల్లో కనిపించి మాయం అయిపోతూ ఉంటారు.ఎంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అయ్యినప్పటికీ కూడా అందరి హీరోయిన్స్ లాగ నిర్మాతలు మరియు దర్శకులు అడిగే కోరికలు తీర్చలేకనో,లేదా సహజంగానే వాళ్లకి అదృష్టం కలిసి రాకనో ఇండస్ట్రీ లో సక్సెస్ కాలేకపోయి ఉండొచ్చు.అలాంటి హీరోయిన్స్ లో ఒకరే అను మెహతా.

Anu mehta
Anu mehta

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా ఆర్య లో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ, ఆ సినిమా ద్వారా ఎంతో క్రేజ్ మరియు పాపులారిటీ ని సంపాదించింది,కానీ ఆ క్రేజ్ ఆమెకి సినిమాల్లో ఆఫర్స్ తెచ్చిపెట్టలేకపోవడమే బాధాకరం.ఆర్య చిత్రం పెద్ద హిట్ అవ్వడం తో ఈమెకి కన్నడ లో ఒక్కడు రీమేక్ ‘అజయ్’ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది,పునీత్ రాజ్ కుమార్ ఇందులో హీరో.

Arya movie actress

తెలుగు లో ఒక్కడు ఎంత పెద్ద హిట్ అయ్యిందో కన్నడ లో కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యింది.దీనితో సౌత్ లోనే అను మరో క్రేజీ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోతుందని అందరూ అనుకున్నారు, ఆ సినిమా తర్వాత తెలుగు లో ఈమెకి అవకాశాలు వచ్చాయి,కానీ ఒక్కటి కూడా పెద్ద హీరో సినిమా కాదు.2005 వ సంవత్సరం లో ఆర్యన్ రాజేష్ – అల్లరి నరేష్ కాంబినేషన్ లో వచ్చిన నువ్వంటే నాకిష్టం అనే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.

- Advertisement -

ఈ సినిమా ఎంత తొందరగా అయితే థియేటర్స్ లోకి వచ్చిందో అంతే తొందరగా థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది.ఆ తర్వాత ఈమె తెలుగులో మహారాజశ్రీ , వేడుక అనే సినిమాల్లో నటించింది.కానీ ఒక్క సినిమా కూడా కలిసి రాలేదు.ఇక ఆ తర్వాత కన్నడ లో ‘హొంగానసు’ అనే చిత్రం లో నటించింది,ఇదే ఆమె ఆఖరి చిత్రం గా చెప్పుకోవచ్చు.

అలా కెరీర్ లో ధ్రువ తార లాగ దూసుకెళ్లిపోతుంది అని అనుకున్న అను మెహతా , కేవలం తెలుగు లో ఒక రెండు హిట్స్ కి మాత్రమే పరిమితమై ఇండస్ట్రీ నుండి వైదొలగింది.ప్రస్తుతం ఈమె ఎక్కడ ఉందో ఏమి చేస్తుందో అనేది ఎవరికీ తెలియదు, కానీ ఆమె లేటెస్ట్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది..ఆర్య సినిమాలో కుందనపు బొమ్మలాగా ఉండే అను మెహతా సడన్ గా ఇలా మారిపోయింది ఏమిటి అని ఆమె లేటెస్ట్ ఫోటోలను చూస్తే అనిపించక తప్పదు..ఇంకా ఎందుకు ఆలస్యం క్రింద ఆమె లేటెస్ట్ ఫోటోను పెట్టి ఉన్నాము చూసేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here