Allu Sneha టాలివుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్, తన భార్య స్నేహ రెడ్డి ల మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు గుప్పుమన్నాయి.. స్నేహ హీరోయిన్ గా ట్రై చేస్తుందని అందుకే మోడరన్ గా రెడీ అయ్యి ఫోటో షూట్ చేస్తుందని, అది నచ్చక బన్నీ విడిగా ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు స్నేహ రెడ్డి పెట్టిన పోస్ట్ అందుకు ఆధ్యం పోస్తుంది.. స్నేహ మిస్ యు అని పెట్టిన ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది..ఇందులో అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో సొంతంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. నిత్యం అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.తన పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది. ఇక స్నేహ ఏ స్టార్ హీరోయిన్ సొంతం చేసుకొని క్రేజ్ ను సోషల్ మీడియా ద్వారా సంపాదించుకుంది.
అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది.. ట్రిప్స్ ఫోటోలను, సందడి చేసిన వీడియోలను పంచుకొని అందరి దృష్టిలో పడుతుంది. ఈ మధ్య స్నేహ అందం విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు. మంచి ఫిజిక్ కోసం బాగా వర్క్ అవుట్ లు చేస్తుంది. అంతేకాకుండా పలు మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని ఫోటో షూట్ లు చేయించుకుంటూ ఆ ఫోటోలను వెంటనే సోషల్ మీడియాలో పెట్టేస్తుంది..
తరచుగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ సోషల్ మీడియాలలో పెట్టడంతో ఈమె సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉందేమో అని అందరూ అనుకున్నారు. కానీ అదంతా నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. ఈ అమ్మడు హీరోయిన్ గా అడుగు పెట్టకుండా కూడా ఆమె గ్లామర్ షో చేయటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ తన కూతురు అల్లు అర్హ మాత్రం ఇండస్ట్రీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
సమంత నటించిన శాకుంతలం సినిమాలో అర్హ ఒక పాత్రలో నటించింది. ఇక త్వరలో ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇదంతా పక్కనే పెడితే తాజాగా స్నేహ రెడ్డి ఒక స్టోరీ పంచుకుంది. అదేంటంటే అందులో తన భర్త అల్లు అర్జున్ ని హగ్ చేసుకుని ఆయనను ట్యాగ్ చేస్తూ మిస్ యు అని పంచుకుంది.. చిలకా గోరింకల్లా ఉండే ఈ జంటను విడిపోయారనడం ఎంత వరకు సమంజసం.? పచ్చని సంసారాల్లో నిప్పులు పోసేందుకు ఎక్కడినుండి వస్తార్రా మీరంతా..?