Sri Reddy : పార్టీని మార్చిన శ్రీరెడ్డి.. అమ్మబాబోయ్ బండబూతులే..



Sri Reddy పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిస్తూ ఫెమస్ అయ్యింది.. తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఈ అమ్మడు పేరు బాగా పరిచయమే.. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బూతులు తిడుతూ వస్తుంది.. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ బాగోతాలను బయట పెడుతూ వస్తుంది.. ఇక వైసీపీకి వీరాభిమాని.. ఆ పార్టీపై, జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే వారికి తన మాటలతో చుక్కలు చూపిస్తుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జనాలకు దగ్గరగా ఉంటుంది.. తనకు ఏదైనా కోపం తెప్పిస్తే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఎకిపారెస్తుంది.. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Sri Reddy
Sri Reddy

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై నటి శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. మొదటిసారి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచింది.. పవన్ పై వ్యతిరేకంగా మాట్లాడిన అనిల్ రెడ్డిని బూతులతో కడిగిపారేసింది. వైసీపీ మద్దతుదారుడిగా వున్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఇటీవల పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. పవన్ భార్య, పిల్లలను తనకు అప్పగించాలని అనిల్ నోరు పారేసుకున్నారు. ఈ వీడియో పై శ్రీ రెడ్డి ఘాటుగా స్పందించింది. వైసీపీ ఉన్న అభిమానంతో మనమంతా జగనన్నను నమ్మిన వాళ్లము. ఒక వెధవ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం గురించి తప్పుగా మాట్లాడాడు.

Sri Reddy Comments

పవన్‌ను తిట్టు తప్పులేదు. కానీ ఆయన భార్య పిల్లలను అనిల్ కుమార్ అనే దరిద్రుడు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల జోలికి వస్తే తాటతీస్తానంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యింది. అనిల్ లాంటి రౌడీ వెధవలను జగనన్న ఎంకరేజ్ చేయడం సరికాదని.. అనిల్ గురించి జగనన్నకు సమాచారం చేరవేయాలని శ్రీరెడ్డి చెప్పింది.. ఇది కొందరికి షాక్ గా అనిపించినా ఇది నిజం.. శ్రీరెడ్డి లో ఇంత మార్పు ఏంటి అని వైసీపీ నేతలు ఆలోచనలో పడ్డారు.. ఇందుకు సంబందించిన నెట్టింట వైరల్ అవుతుంది.. ఇక దీనిపై ఎన్ని చర్చలు జరుగుతాయో చూడాలి..