Prabhas టాలీవుడ్ లో ఆన్ స్క్రీన్ మీద చూసేందుకు ముచ్చటగా ఉండే జంటలలో ఒకటి ప్రభాస్ మరియు కాజల్ అగర్వాల్ జంట. వీళ్లిద్దరు కలిసి గతం లో డార్లింగ్,మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి, కానీ ఈ సినిమాల తర్వాత వీళ్లిద్దరు మళ్ళీ కలిసి నటించలేదు. అందుకు కారణం వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన విబేధాలే అన్ని తెలుస్తుంది.అసలు విషయానికి వస్తే డార్లింగ్ మూవీ సమయం లో వీళ్లిద్దరూ మంచి స్నేహితులయ్యారు, ఆ తర్వాత ప్రేమించుకున్నారు కూడా అన్ని అప్పట్లో ఒక వార్త హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.డేటింగ్ కూడా చేసారని అప్పట్లో ఒక వార్త ప్రచారం లో ఉండేది.
అయితే ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విబేధాల కారణం గా విడిపోవాల్సి వచ్చింది.అప్పటి నుండి వీళ్లిద్దరు కలిసి సినిమాలు చెయ్యడం కానీ, బయట కలుసుకోవడం కానీ జరగలేదు.మరొకటి గమనించాల్సిన విషయం ఏమిటంటే కాజల్ అగర్వాల్ ప్రతీ స్టార్ హీరో పుట్టినరోజు కి తన ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసే అలవాటు ఉంది. మొన్ననే ఈమె అల్లు అర్జున్ పుట్టినరోజు కి కూడా విష్ చేసింది.
కానీ ప్రభాస్ పుట్టినరోజు కి మాత్రమే ఆమె ఇప్పటి వరకు శుభాకాంక్షలు తెలియచేయ్యలేదు. అందుకు కారణం ఇదే అని అంటుంటారు. వీళ్ళమధ్య ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ వీళ్ళ పెయిర్ ని ఇష్టపడే అభిమానుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. భవిష్యత్తులో అయినా వీళ్లిద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే చూడాలని చాలా మంది ఇప్పటికీ కోరుకుంటూ ఉంటారు. మరియు వారి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.