అభిమానులను అబ్బురపరుస్తున ప్రభాస్ Project – K మేకింగ్ వీడియో

- Advertisement -

Project – K ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’.ఆసక్తికరమైన కథాంశం తో మహానటి దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సుమారుగా 500 కోట్ల రూపాయిల ఖర్చు తో నిర్మిస్తుంది. దీపికా పాడుకొనే మరియు అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్స్ కూడా ఇందులో నటిస్తున్నారు.

Project - K
Project – K

మహాభారతం లోని కురుక్షేత్రం అంకం లోకి టైం మెషిన్ ద్వారా వెళ్లే కథాంశం తో ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. కురుక్షేత్ర సంగ్రామం కి వెళ్లే ప్రాజెక్ట్ కాబట్టి, ఈ చిత్రానికి ప్రాజెక్ట్ K అని నామకరణం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వీడియో ఒకటి నేడు మూవీ టీం విడుదల చేసింది. ఈ వీడియో లో విలన్ లుక్ ఎలా ఉంటుందో చూపించారు.

Prabhas Project - K

ఇంగ్లీష్ సినిమాలలో మార్వెల్ సూపర్ హీరోస్ మరియు సూపర్ విలన్స్ ఎలా అయితే ఉంటారో, అలానే ఈ చిత్రం లో కూడా ఉండబోతునట్టుగా చూపించారు. ఈ చిత్రం లో విలన్ గా బాలీవుడ్ కి చెందిన కొత్త నటుడు నటిస్తున్నాడు. ఆసక్తికరంగా ఉన్న ఆ మేకింగ్ వీడియో, విలన్ పాత్ర కి సంబంధించిన స్కెచెస్ ని మీరు ఈ క్రింది వీడియో లో చూడొచ్చు.

- Advertisement -

సరికొత్త పద్దతి లో డైరెక్టర్ నాగ అశ్విన్ ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ని చూసుకుంటున్నాడు. ఇది వరకే ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల కాబోతున్నట్టుగా అధికారిక ప్రకటన చేసారు. ఇప్పుడు అదే తేదీన విడుదల అవుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పటి నుండే మేకింగ్ వీడియోస్ వంటివి వదులుతున్నారంటే కచ్చితంగా జనవరి 12 వ తేదికి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి రెడీ అవుతున్నట్టే లెక్క అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి మేకర్స్ మైండ్ లో ఏముందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here