Samantha : అతని కోసం న్యూడ్ లుక్ లో కనిపించబోతున్న సమంత.. మరీ ఇలా తయారు అయ్యిందేంటి!

- Advertisement -

Samantha : సౌత్ లో అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి సమంత.నాగ చైతన్య రెండవ సినిమా ‘ఏం మాయ చేసావే’ చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచయమైన సమంత తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది.ఈ సినిమా తర్వాత వరుసగా ఆమె స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ ఎన్నో బ్లాక్ బస్టర్ లు ఇండస్ట్రీ హిట్లు కొట్టి నెంబర్ 1 హీరోయిన్ గా ఎదిగింది.

Samantha
Samantha

అయితే నాగ చైతన్య ని పెళ్లాడిన తర్వాత మరియు అతని తో విడిపోయిన తర్వాత కూడా కేవలం హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా, నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మరియు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఎక్కువగా చేస్తూ వస్తుంది.అంతే కథ డిమాండ్ చేస్తే విలన్ రోల్స్ చెయ్యడానికి కూడా ఆమె వెనకాడడం లేదు, గతం లో ఆమె అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వెబ్ సిరీస్ లో నెగటివ్ రోల్ చేసి అందరినీ షాక్ కి గురి చేసింది.

Samantha Photos

ఇప్పుడు ఆ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ & డీకే సమంత తో ‘సిటాడెల్’ అనే మరో వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు.ఈ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది.హాలీవుడ్ లో సూపర్ హిట్టైన ‘సిటాడెల్’ టీవీ సిరీస్ ని ఇండియన్ వెర్షన్ కి తెస్తున్నారు రాజ్ & డీకే.ఈ సిరీస్ లో అక్కడ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ రిచర్డ్ మ్యాడెన్ మరియు బాలీవుడ్ అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లు గా నటించగా, ఇక్కడ సమంత మరియు వరుణ్ ధావన్ నటిస్తున్నారు.

- Advertisement -
Samantha Stills

ఇందులో సమంత రా ఏజెంట్ గా కనిపించనుంది. భారీ పోరాట సన్నివేశాల్లో కూడా నటించింది. అంతే కాదు హీరో వరుణ్ ధావన్ తో సెమీ న్యూడ్ లుక్ తో శృంగార సన్నివేశాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సమంత. పాత్ర డిమాండ్ చెయ్యాలే కానీ ఏది చేయడానికైనా సిద్ధం అంటూ సమంత మేకర్స్ కి మాట ఇచ్చేసిందట. మరి ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Samantha varun dhawan
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here