Keerthi Reddy : ‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇంత దారుణంగా తయారు అయ్యిందేంటి.. ఆమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

Keerthi Reddy : కొంతమంది హీరోయిన్లు చేసింది అతి తక్కువ సినిమాలే అయినా వాళ్ళని మనం మరచిపోలేము.రూపం లో కానీ నటనలో కానీ వాళ్ళు ప్రేక్షకుల మనసుని కట్టడి చేసేస్తారు.అలా ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే యువకుల మనసుల్ని కొల్లగొట్టేసింది కీర్తి రెడ్డి.పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన తొలిప్రేమ సినిమాలో అందంతో పాటు చక్కని అభినయం తో కీర్తి రెడ్డి ఎంత మంచి క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

Keerthi Reddy
Keerthi Reddy

ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ కి ఎంత మంచి క్రేజ్ సంపాదించుకున్నాడో,కీర్తి రెడ్డి కి కూడా అదే రేంజ్ క్రేజ్ వచ్చింది.ఈ చిత్రానికి ముందే ఆమె తమిళం లో మూడు సినిమాల్లో నటించింది.కానీ మొదటి సినిమా అలీ ప్రధాన పాత్ర పోషించిన ‘గన్ షాట్’ అనే చిత్రం.ఇక తొలి ప్రేమ సినిమా సక్సెస్ తో ఈమెకి అవకాశాలు క్యూ కట్టినప్పటికీ కూడా ఆమె చేతికి అందిన ప్రతీ ప్రాజెక్ట్స్ చెయ్యకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంది.

Keerthy Reddy Photos

తొలిప్రేమ తర్వాత ఆమె తెలుగు లో అక్కినేని నాగార్జున తో కలిసి ‘రావోయి చందమామ’ మరియు వద్దే నవీన్ తో కలిసి ‘ప్రేమించే మనసు’ వంటి చిత్రాలు చేసింది.ఇవి పెద్దగా సక్సెస్ సాధించలేదు,కానీ హిందీ లో మాత్రం ఈమెకి మంచి సక్సెస్ లు వచ్చాయి.అలా 2002 వ సంవత్సరం వరకు హీరోయిన్ గా నటించిన ఈమె, 2004 వ సంవత్సరం లో మహేష్ బాబు హీరో గా నటించిన ‘అర్జున్’ చిత్రం లో అక్క పాత్ర పోషించి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.అదే సంవత్సరం లో ఈమె ప్రముఖ హీరో సుమంత్ ని ప్రేమించి పెళ్లాడింది.

- Advertisement -
Keerthy Reddy Stills

కొన్నాళ్ళు అతనితో కాపురం చేసిన తర్వాత అభిప్రాయం బేధాలు రావడం తో విడిపోవాల్సి వచ్చింది.ఆ తర్వాత ఈమె NRI ని పెళ్ళాడి అమెరికా లో స్థిరపడిపోయింది. ఈమెకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, అయితే చాలా కాలం తర్వాత ఈమధ్యనే ఈమె ఒక పెళ్ళికి హాజరైంది. ఆ పెళ్ళిలో ఈమెని చూసిన వారంతా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఆమె బాగా లావెక్కింది, ఆమెకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటో ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి.

Keerthy Reddy Latest Stills
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here