Akkineni Nagarjuna : బాలయ్య వ్యాఖ్యలపై నాగార్జున అందుకే స్పందించలేదా?



Akkineni Nagarjuna : స్టార్ హీరో బాలయ్య వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో మాట్లాడుతూ..అక్కినేని..తొక్కినేని అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య ఈ విధంగా కామెంట్లు చేసి తప్పు చేశాడని చేసిన తప్పును బాలయ్య సరిదిద్దుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.అంతేకాదు మరోవైపు అక్కినేని ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ మాటల వార్ కూడా మొదలైందని తెలుస్తుంది..

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna

ఇది ఇలా ఉండగా.. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య, అఖిల్ స్పందించిన నాగార్జున స్పందించక పోవడం పై అనేక వార్తలు గుప్పుమాన్నాయి.బాలయ్య వ్యాఖ్యల గురించి నాగార్జున స్పందించకపోవడం వెనుక అసలు కారణం వేరే ఉంది. ఈ వ్యాఖ్యల గురించి నాగ్ స్పందిస్తే ఈ వివాదం మరింత పెద్దదయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కారణాలు తెలియవు కావు కానీ బాలయ్య నాగ్ మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్నాయి.

ఈ వివాదం గురించి నాగ్ స్పందిస్తే రాబోయే రోజుల్లో కూడా రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉండవు.. ఇక ఏపీలో ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో బాలయ్య క్షమాపణలు చెబితే బాగోదని వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. బాలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొనే దిశగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Akkineni naga chaitanya and balakrishna

బాలయ్య క్షమాపణలు చెప్పని పక్షంలో లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటామని బెదిరింపులు వస్తున్నాయి. బాలయ్య వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం తర్వాత సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.. నందమూరి ఫ్యాన్స్ కూడా బాలయ్యకు క్షమాపణలు చెప్పాలని సలహాలు ఇస్తున్నారని తెలుస్తుంది.. మరి ఇది ఎంతవరకు వెళుతుందో చూడాలి..